ఆసియా కప్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడిందే! సున్నాకే అవుటైనా... గౌతమ్ గంభీర్ కామెంట్..

Published : Aug 29, 2023, 11:09 AM IST

ఆసియా కప్ 2023 సందడి మొదలైపోయింది. ఆగస్టు 30న పాకిస్తాన్‌లో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ,సెప్టెంబర్ 17న శ్రీలంకలో ముగియనుంది. సెప్టెంబర్ 2న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి విపరీతమైన హైప్ వచ్చింది..  

PREV
17
ఆసియా కప్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడిందే! సున్నాకే అవుటైనా... గౌతమ్ గంభీర్ కామెంట్..

ఆసియా కప్ టోర్నీకి 40 ఏళ్ల చరిత్ర ఉంది. మరి ఆసియా కప్‌ చరిత్రలో బెస్ట్ ఇన్నింగ్స్ ఏది? టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి గౌతీ చెప్పిన సమాధానం, కోహ్లీ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది..

27

‘పాకిస్తాన్‌పై 330 పరుగుల భారీ స్కోరు ఛేదిస్తున్నాం. సున్నాకే తొలి వికెట్ పడిపోయింది. అలాంటి టైమ్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్, మిగిలిన భారత బ్యాటర్ల అన్ని ఇన్నింగ్స్‌లను తుడిచి పెట్టేసింది..
 

37

ఆ మ్యాచ్‌లో నేను కూడా ఆడాను. డకౌట్ అయ్యింది కూడా నేనే. మొదటి ఓవర్‌లోనే వికెట్ పడడంతో ఆ మ్యాచ్‌ ఓడిపోతామని అనుకున్నా. కానీ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు..  నా వరకూ ఆసియా కప్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

47

2012 ఆసియా కప్‌లో భాగంగా మీర్‌పూర్‌లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్,329 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ హఫీజ్ 105, నజీర్ జంషేడ్ 112, యూనిస్ ఖాన్ 52 పరుగులు చేశారు. ప్రవీణ్ కుమార్, అశోక్ దిండా రెండేసి వికెట్లు తీశారు. 

57

ఈ లక్ష్యఛేదనలో గౌతమ్ గంభీర్ డకౌట్ అయ్యాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. సచిన్ టెండూల్కర్ (52 పరుగులు)తో కలిసి రెండో వికెట్‌కి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ..
 

67

ఆ తర్వాత నాలుగో స్థానంలో వచ్చిన రోహిత్ శర్మ (68 పరుగులు)తో కలిసి 175 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ, మొదటి ఓవర్ మూడో బంతికి వచ్చి 48వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు.

77

148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 183 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories