విరాట్ కోహ్లీ కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటే బెటర్... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

First Published Jan 27, 2022, 12:43 PM IST

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం ప్రకటించిన విరాట్, రవి భాయ్ అంటూ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు...

విరాట్ కోహ్లీకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లలో టీమిండియా విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి... 

రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియాలో విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైం మొదలైంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోల్పోయి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

‘విరాట్ కోహ్లీ వయసు ఇప్పుడు 33 ఏళ్లు. ఫిట్‌గా ఉంటే మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు విరాట్... ఆ విషయం విరాట్‌కి తెలుసు...

ఇప్పుడు మిగిలిన విషయాలన్నీ పక్కనబెట్టి, కేవలం తన బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టాలి... మానసికంగా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కొంత బ్రేక్ తీసుకుంటే మంచిది...

వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి కానీ ఆ తర్వాత శ్రీలంకతో సిరీీస్‌ నుంచి కానీ, లేదా రెండు లేదా మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉంటే బెటర్... అతనిలో ఉన్న బ్యాటింగ్‌ని ఈ బ్రేక్ బయటికి తెస్తుంది...

బ్రేక్ తర్వాత విరాట్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఎలా ఉండాలంటే, రాబోయే మూడు, నాలుగేళ్లు మళ్లీ కింగ్‌లా ఆడాలి... మెంటల్‌గా క్లియర్‌గా ఉంటే విరాట్ ఏదైనా సాధించగలడు...

తన రోల్ ఏంటో, జాబ్ ఏంటో తెలిసి, ఓ బ్యాట్స్‌మెన్‌గా ఆడితే... విరాట్ కోహ్లీ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్... 

కమ్‌బ్యాక్ తర్వాత విరాట్ జట్టు విజయాల్లో కీ రోల్ పోషించాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

సౌతాఫ్రికా టూర్ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండు సిరీసుల్లోనూ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు కోహ్లీ...

click me!