ఇప్పుడైనా బాబర్‌కి విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చి ఉంటే బాగుండేది... పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ..

Published : Jul 16, 2022, 04:57 PM IST

విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండి సెంచరీల మోత మోగిస్తున్నప్పుడు బాగా ఆడుతున్నాడని చెప్పడానికి రాని నోళ్లు, ఇప్పుడు ఫామ్‌లో లేక సెంచరీ మార్కు అందుకోవడానికి కష్టపడుతున్నప్పుడు తెగ పేలుతున్నాయి. విరాట్ కోహ్లీ కెరీర్‌లో పావు వంతు పరుగులు కూడా చేయని ప్లేయర్లు కూడా అతనికి సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలెట్టారు...

PREV
17
ఇప్పుడైనా బాబర్‌కి విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చి ఉంటే బాగుండేది... పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ..

‘త్వరలోనే ఈ పరిస్థితుల నుంచి బయటికి వస్తావ్... ధైర్యంగా ఉండు’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ గురించి వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది... ఈ ఒక్క ట్వీట్‌తో బాబర్ ఆజమ్ ఓ మెట్టు ఎక్కేశాడని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు...

27
Babar Azam, Virat Kohli

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బాబర్ ఆజమ్.. ఈ ట్వీట్ వేయడానికి గల కారణాలను కూడా వివరించాడు...

37

‘విరాట్ కోహ్లీ ఎంతో క్రికెట్ ఆడాడు. అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే, కోహ్లీ ఏం సాధించాడో అర్థమవుతుంది. ఇప్పుడు అతను సరైన ఫామ్‌లో లేడు. ఈ సమయంలో మోరల్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే అలా ట్వీట్ చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ ఆజమ్...

47

‘ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వాలంటే క్రికెట్ లేదా మరేదైనా ఆటల వల్లే అవుతుంది. రాజకీయ నాయకుల కంటే క్రికెటర్లు, అథ్లెట్లు ఇరు దేశాల మధ్య ఉన్న తారతమ్యాలను చెరిపివేయగలరు...

57

చాలామంది క్రికెటర్లు ఈ పని కరెక్టుగా చేస్తున్నారు కూడా. బాబర్ ఓ మెంచి మెసేజ్ ఇచ్చాడు. అయితే అవతలి వైపు నుంచి ఇప్పటిదాకా సరైన రెస్పాన్స్ అయితే రాలేదు...

67
Image credit: PTI

ఇలాంటి సమయాల్లో అయినా విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చి ఉంటే బాగుండేది. అలాంటి రెస్పాన్స్ వస్తే ఇరుదేశాల మధ్య శత్రుత్వం లాంటివి ఏదీ లేదనే మెసేజ్ ఇచ్చినట్టు అయ్యుండేది. 

77
Image Credit: Getty Images

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ రిప్లై ఇస్తాడని మాత్రం అనుకోవడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ...

Read more Photos on
click me!

Recommended Stories