ఎప్పుడూ రోహిత్‌ను అలా చూడలేదు, ముట్టుకుంటే ఏడ్చేసే వాడేమో... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Published : Jul 16, 2022, 03:36 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టిన రోహిత్ శర్మ, రెండో వన్డేలో 10 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ పరుగులేమీ చేయకపోయినా, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి జరుగుతున్న చర్చతో హిట్ మ్యాన్ సేఫ్ అయిపోయాడు...

PREV
16
ఎప్పుడూ రోహిత్‌ను అలా చూడలేదు, ముట్టుకుంటే ఏడ్చేసే వాడేమో... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

గత ఏడాది లార్డ్స్ గ్రౌండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 151 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు... 
 

26

ఈ టెస్టులో 83 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సెంచరీ మార్కును 17 పరుగుల తేడాతో మిస్ చేసుకున్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ... సెంచరీ మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యాడట...

36

‘రోహిత్ శర్మ అవుట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి చాలా సైలెంట్‌గా కూర్చున్నాడు. అతను ఓ రకమైన డిప్రెషన్‌లో ఉన్నాడు. ముట్టుకుంటే ఏడ్చేస్తాడేమో అనిపించింది...

46

అతను సెంచరీ చేయాలని గట్టిగా అనుకున్నాడు. లార్డ్స్‌లో సెంచరీ చేస్తే ఆ ఫీలింగ్ వేరే రేంజ్‌లో ఉంటుంది. అందుకే సెంచరీ మిస్ అయినందుకు అతను బాగా బాధపడ్డాడు... ఆ ఫీలింగ్‌తోనే ఓవల్‌లో సెంచరీ చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

56

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 368 పరుగులు చేసిన రోహిత్ శర్మ... కరోనా పాజిటివ్ బారిన పడడంతో ఐదో టెస్టుకి దూరంగా ఉన్నాడు..  

66

తన కెరీర్‌లో 45 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ, 8 సెంచరీలు నమోదు చేశాడు. చాలా ఏళ్ల పాటు విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయిన రోహిత్ శర్మ, 2021లో ఇంగ్లాండ్ టూర్‌లో ఆ ఫీట్ అందుకున్నాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories