ధోనీ విషయంలో లేవనినోళ్లు, విరాట్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా... బీసీసీఐ వెనకుండి...

First Published Jul 16, 2022, 4:25 PM IST

భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ... ముగ్గురి విషయంలో చాలా పోలికలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 కాగా... కెరీర్‌లో ఒకానొక దశలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నవారే...

సౌరవ్ గంగూలీ 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయి టీమిండియాలో చోటు కోల్పోతే, 2019 వన్డే వరల్డ్‌కప్‌కి ముందు ఎమ్మెస్ ధోనీ ఫామ్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది...

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ కూడా ఇదే రకమైన పొజిషన్‌ని ఫేస్ చేస్తున్నాడు. అయితే గంగూలీ, ధోనీ సమయంలో విమర్శలు చేసినవాళ్లు, బయటివాళ్లు మాత్రమే. అయితే విరాట్ కోహ్లీ విషయానికి వచ్చే సరికి భారత మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేయడం మొదలెట్టారు...
 

Latest Videos


విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల్లో, చేసిన పరుగుల్లో పావు వంతు కూడా ఆడలేకపోయిన ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్, అజయ్ జడేజా వంటి క్రికెటర్లు కూడా అతను టీమ్‌లో ఉండడానికి అర్హుడు కాడంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది...

విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత మాజీ క్రికెటర్లతో పాటు ఫారిన్ క్రికెటర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లను ఆడిస్తే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు... 

మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెరీర్ ముగింపు దశలో కొన్నేళ్ల పాటు పరుగులు చేయలేకపోయాడు. నెమ్మదిగా ఆడుతూ భారత జట్టు పరాజయాలకు కారణమయ్యాడు. అయితే మాహీపై నోరు మెదిపే సాహసం చేయలేదు ఎవ్వరూ... బయటి వ్యక్తులు, సోషల్ మీడియాలో మాహీపై ట్రోల్స్ చేయడం తప్ప, మాజీ క్రికెటర్లు ఎవ్వరూ ఒక్క మాట అన్నది లేదు..

పరుగులు చేసినా, చేయకపోయినా మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్‌లో ఉండాల్సిందేనంటూ పట్టుబట్టి కామెంట్లు చేశారు. భారత జట్టుకి ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు... 

Kohli and Dhoni

దీనికి ప్రధాన కారణం కోహ్లీ యాటిట్యూడ్ మాత్రమే కాదు, అతని క్రేజ్ కూడా. విరాట్ కోహ్లీకి విదేశాల్లో ఎంత మంది అభిమానులు ఉన్నారో, స్వదేశంలో అంత మంది హేటర్స్ ఉన్నారు. అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో చాలామందికి శత్రువుగా మారాడు విరాట్...

అందుకే విరాట్ కోహ్లీపై ఎన్నో ఏళ్లుగా కడుపులో దాచుకున్నదంతా ఇప్పుడు ఇలా బయటపెడుతున్నారని పోస్టులు చేస్తున్నారు ఆయన అభిమానులు. భారత జట్టుకి మాహీ ఎంత చేశాడో, విరాట్ కోహ్లీ కూడా అంతే చేశాడు... ఓ బ్యాటర్‌గా అంతకంటే ఎక్కువ కూడా...

విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, భారత మాజీ క్రికెటర్లతో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తోందని, కోహ్లీని జట్టుకి దూరం చేయడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

Kohli and Dhoni

కేవలం రెండు వరల్డ్ కప్స్ గెలిచినంత మాత్రాన ఎమ్మెస్ ధోనీ గొప్పొడు అయిపోతే, భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించినా ఐసీసీ టైటిల్ గెలవని కారణంగా విరాట్ శత్రువులా మారిపోతాడా? అని విమర్శలు చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్... 

click me!