వాళ్లు కొట్టి ఉంటే ఫీల్ అయ్యేవాడిని! విరాట్ ఒక్కడి వల్లే అవుతుంది... హారీస్ రౌఫ్ కామెంట్స్...

Published : Dec 01, 2022, 09:45 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ ఫ్యాన్స్‌కి మంచి హైదరాబాదీ బిర్యానీ తిన్న ఫీలింగ్‌ని కలిగించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు... వరల్డ్ కప్ టోర్నీకే హైలైట్స్‌గా నిలిచాయి...

PREV
18
వాళ్లు కొట్టి ఉంటే ఫీల్ అయ్యేవాడిని! విరాట్ ఒక్కడి వల్లే అవుతుంది... హారీస్ రౌఫ్ కామెంట్స్...

టీమిండియా విజయానికి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో పాక్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు విరాట్ కోహ్లీ. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. ఈ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది భారత జట్టు..

28
Image credit: Getty

‘విరాట్ కోహ్లీ, వరల్డ్ కప్‌లో ఆడిన విధానం మాస్టర్ క్లాస్... అతను ఎలాంటి షాట్స్ ఆడతాడో, ఎలాంటి షాట్స్ ఆడగలడో అందరికీ తెలుసు. నా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్లు, ప్రపంచంలో మరే బ్యాట్స్‌మెన్ కొట్టలేడు... 

38
Virat Kohli

ఒకవేళ దినేశ్ కార్తీక్ కానీ, హార్ధిక్ పాండ్యా కానీ నా బౌలింగ్‌లో ఇలాంటి షాట్స్ ఆడి ఉంటే బాగా ఫీల్ అయ్యేవాడిని... కానీ విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ బ్యాట్ నుంచి రావడం సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే అతను వేరే లెవెల్...

48

నేను బౌలింగ్‌కి వచ్చే సమయానికి ఇండియా విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. నేను మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ నవాజ్ ఆఖరి ఓవర్ వేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. అతను స్పిన్నర్ కాబట్టి ఆఖరి ఓవర్‌కి 20 పరుగులైనా పెట్టాలని అనుకున్నా...

58
virat kohli

అనుకున్నట్టుగానే మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో నేను వేసిన బాల్స్‌ను విరాట్ కోహ్లీ అద్భుతంగా బౌండరీ అవతల పడేశాడు. ఆ ఓవర్‌లో నేను వేసిన బంతుల్లో ఒకే ఒక్క స్లో బాల్ ఉంది. అది కూడా హార్ధిక్ ఫేస్ చేశాడు...

68
Virat Kohli Six

మెల్‌బోర్న్‌ స్టేడియం చాలా పెద్దది. అందుకే లైన్ అండ్ లెంగ్త్ కరెక్టుగా చూసుకుంటే చాలని అనుకున్నా. అయితే విరాట్ కోహ్లీ ఇలాంటి షాట్స్ ఆడతాడని అస్సలు అనుకోలేదు.

78

నా బౌలింగ్‌లో అతను కొట్టిన రెండు షాట్స్ కూడా కోహ్లీ క్లాస్‌ని చూపించాయి.. నా బౌలింగ్‌లో ఎలాంటి పొరపాటు జరగలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్...

88
Haris Rauf

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు విరాట్ కోహ్లీ కాగా మరొకరు సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా. భవుమా ఓ సిక్సర్ కొడితే విరాట్ కోహ్లీ డెత్ ఓవర్లలో 2 సూపర్ క్లాస్ సిక్సర్లు సంధించాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories