విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడానికి వాళ్లే కారణం... ఆర్‌సీబీ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కామెంట్స్...

First Published Sep 20, 2021, 4:20 PM IST

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు...

తొలుత టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మూడు రోజులకే ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నటు తెలియచేశాడు...

ఐపీఎల్ 2021 సీజన్ ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఆఖరి సీజన్. ప్లేయర్‌గా తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆర్‌సీబీ తరుపునే ఆడతానని ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు కోహ్లీ...

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్...

‘విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన లీడర్. ఆరంభం నుంచి అతను ఆర్‌సీబీతోనే ఉన్నాను. అయితే అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటో నాకు తెలీదు... 

కోహ్లీ కూతురే, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అనుకుంటా... కూతురితో ఎక్కువ సమయం గడపడానికి, కెప్టెన్సీ కారణంగా తన మెదడు మోస్తున్న భారాన్ని తగ్గించుకోవాలని కోహ్లీ భావించి ఉండొచ్చు...

నా వరకీ విరాట్ కోహ్లీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నా...  అతని రికార్డులు చూస్తే, తన పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పొచ్చు.

అతని కెప్టెన్సీపైన ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే తనకి నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా ఆలోచించి ఉంటాడు...

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఐపీఎల్‌లో రెండు, మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయితే అతనిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వస్తుంది... టీ20 కెప్టెన్సీ వదిలేశాడు, ఆర్‌సీబీ కెప్టెన్సీ కూడా వదిలేయొచ్చుగా అంటారు...

అలాంటి విమర్శలు రాకముందే విరాట్ కోహ్లీ, సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు... కొన్నిసార్లు ఎంత మంచి ప్లేయర్ అయినా పరిస్థితులకు తలొగ్గాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్...

click me!