సురేష్ రైనా స్కూల్ పిల్లాడిలా బ్యాటింగ్ చేశాడు... డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్...

First Published Sep 20, 2021, 3:38 PM IST

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చాడు సురేష్ రైనా. 5 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సురేష్ రైనా, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

‘మిస్టర్ ఐపీఎల్’గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా, ఆ టైమ్‌లోనే షార్ట్ పిచ్ బంతులు వేస్తూ, తెగ ఇబ్బంది పెట్టారు ముంబై ఇండియన్స్ బౌలర్లు...

సురేష్ రైనా అవుట్ కావడంతో 7 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూప్ కింగ్స్, ఎమ్మెస్ ధోనీ కూడా ఫెయిల్ కావడంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది...

ఈ మ్యాచ్‌లోనే కాదు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లోనూ 2,5,8,2,4 పరుగులు చేసిన సురేష్ రైనా, డబుల్ డిజిట్ స్కోరు కూడా అందుకోలేకపోయాడు...

‘సురేష్ రైనా, ముంబై బైలర్లను ఫేస్ చేయడానికి ఏ మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు. అతని బ్యాటింగ్, ఓ స్కూల్ పిల్లాడిలా అనిపించింది...

ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్‌లా అతని బ్యాటింగ్ స్టైల్ కనిపించలేదు... అతను అలా అవుట్ కావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్.

ఐపీఎల్‌లో 201 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలతో 5495 పరుగులు చేశాడు... రైనా లేకుండా సీఎస్‌కే గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది...

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్‌గా వైదొలుగుతూ ప్రకటించిన నిర్ణయంపై కూడా డేల్ స్టెయిన్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన లీడర్. అతని రికార్డులు చూస్తే, తన పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పొచ్చు.

అతని కెప్టెన్సీపైన ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే తనకి నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఈ నిర్ణయం సరైనదే అనుకుంటున్నా...

టీ20 వరల్డ్‌కప్, ఐపీఎల్‌ సీజన్‌లో అతను కెప్టెన్‌గా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్...

click me!