అలాంటి టీమ్‌ దొరికితే ఎవ్వరైనా టైటిల్స్ గెలుస్తారు... ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కామెంట్స్...

Published : Dec 11, 2021, 03:36 PM IST

ఐపీఎల్‌ పర్ఫామెన్స్ ద్వారా చాలా మంది ప్లేయర్లకు భారత జట్టులో చోటు దొరికితే, రోహిత్ శర్మకు ఏకంగా టీమిండియా కెప్టెన్సీయే దక్కింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాల్లో తాను చేసింది, చాలా తక్కువని కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

PREV
110
అలాంటి టీమ్‌ దొరికితే ఎవ్వరైనా టైటిల్స్ గెలుస్తారు... ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కామెంట్స్...

2011 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లిన రోహిత్ శర్మ, 2013 సీజన్‌లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు...

210

ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్ అందించిన రోహిత్ శర్మ, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు...

310

ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో భారత జట్టులో స్థిరమైన సంపాదించుకుని, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కి వైస్ కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మ... టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు టీ20 కెప్టెన్సీ, సౌతాఫ్రికా టూర్‌లో వన్డే కెప్టెన్సీతో పాటు టెస్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకోబోతున్నాడు...

410

‘ముంబై ఇండియన్స్‌లో చాలా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. నేను కేవలం వారిని సరిగా వాడుకోగలిగానంతే...

510

నిజంగా చెబుతున్నా, ముంబై ఇండియన్స్ విజయాల్లో నేను చేసింది చాలా తక్కువే. ఎందుకంటే అక్కడ నేను చేయడానికి కూడా పెద్దగా ఏమీ లేదు...

610

భారత జట్టుని కూడా అలా తయారుచేయాలని అనుకున్నా. ఐసీసీ టైటిల్స్ గెలవడమే లక్ష్యంగా వచ్చే రెండేళ్లు పనిచేస్తాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

710

టీ20 కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్సీ ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని... అయితే బీసీసీఐ మాత్రం వన్డే కెప్టెన్సీ నుంచి కూడా విరాట్‌ను తొలగించిందని వార్తలు వచ్చాయి...

810

అయితే టీ20 కెప్టెన్సీ బాధ్యతలు మాత్రమే తీసుకోవడానికి అంగీకరించిన రోహిత్ శర్మ, వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా ఇస్తేనే, టీ20 కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి..

910

టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం వల్లే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకని, బీసీసీఐ... విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

1010

పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఆడిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేయడంతో సౌతాఫ్రికా టూర్‌కి రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని సమాచారం...

Read more Photos on
click me!

Recommended Stories