Champions Trophy 2025: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2008లో భారత్ తరపున వన్డేల్లోకి అడుగుపెట్టి, ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రికార్డులు మోత మోగిస్తున్నారు.
Virat Kohli's 300th ODI Records: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 300వ ODI ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇది జరగనుంది. దీంతో పలు రికార్డులు బద్దలుకొట్టనున్నాడు.
మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ధోనీ తర్వాత 300 ODIలు ఆడుతున్న ఏడో భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ 2008లో తన వన్డే కెరీర్ మొదలుపెట్టి ప్రపంచ క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. విరాట్ కోహ్లీ 300వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా, అతను సాధించిన కొన్ని రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025
1. వేగంగా 4000 నుంచి 14,000 వన్డే పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కోహ్లీ ODI క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. లక్ష్యాలను ఛేదించడంలో, పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో కోహ్లీకి ఎవరూ సాటిలేరు. 4000 నుంచి 14,000 పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర సరసన నిలిచాడు.
36
2. 55+ సగటుతో 10000+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీ
విరాట్ కోహ్లీ ODI క్రికెట్ చరిత్రలో 55 సగటుతో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. 299 మ్యాచ్‌లలో 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. ధోనీ 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. విదేశాల్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడటం కోహ్లీ ప్రత్యేకత.
46
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025
3. విజయాల్లో 10,000+ ODI పరుగులు చేసిన యాక్టిక్ ప్లేయర్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ODI క్రికెట్‌లో విజయాల్లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. మొత్తం మీద లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ తర్వాత కోహ్లీ ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 184 మ్యాచ్‌లలో 75.20 సగటుతో 10,228 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 169 మ్యాచ్‌లలో 58.58 సగటుతో 7851 పరుగులు చేశాడు. కోహ్లీ గొప్ప మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం.
56
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్
4. అత్యధిక ODI సెంచరీలు సాధించిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ODI క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్‌పై 117 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్‌పై 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒత్తిడిలో కూడా సెంచరీలు చేయగల సత్తా కోహ్లీ సొంతం.
66
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025
5. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
యాక్టివ్ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ODI క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. 299 ODI మ్యాచ్‌లలో 42 అవార్డులు అందుకున్నాడు. షకీబ్ అల్ హసన్ 27 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య వరుసగా 62, 48 అవార్డులతో ముందున్నారు. కోహ్లీ అన్ని పరిస్థితుల్లోనూ రాణించగలడు.