సీఎస్‌కే ఎల్లో జెర్సీలో విరాట్ కోహ్లీ... షాకైన ఆర్‌సీబీ అభిమానులు...

First Published Apr 4, 2021, 11:03 AM IST

ఐపీఎల్ ప్రారంభమైన సీజన్ నుంచి ఒకే జట్టులో కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ... మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా లాంటి ప్లేయర్లు, సీఎస్‌కేపై బ్యాన్ కారణంగా రెండేళ్లు వేరే జట్లకు ఆడినా.. కోహ్లీ మాత్రం ముందు నుంచి ఆర్‌సీబీలోనే ఉన్నాడు. అయితే తాజాగా అతన్ని ఎల్లో జెర్సీలో చూసి షాక్ అవుతున్నారు అభిమానులు...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ప్రతీ జట్టూ కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ జెర్సీలకు తగ్గట్టుగా ట్విట్టర్‌లో ఎమోజీలు కూడా మారుతూ ఉంటాయి...
undefined
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హ్యాష్ ట్యాగ్‌కి ఎల్లో జెర్సీని జోడించింది ట్విట్టర్. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు...
undefined
కొందరు లీగ్ ఆరంభం నుంచి ఎరుపు రంగులో డిజైన్ చేస్తున్నా కలిసి రాకపోతుండడంతో రాయల్ ఛాలెంజర్స్, ఈసారి పసుపు రంగు జెర్సీని ఎంచుకున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు...
undefined
అయితే ఇది ట్విట్టర్ చేసిన చిన్న పొరపాటు అని తెలిసిన నెటిజన్లు, దీనిపై ట్రోలింగ్ మొదలెట్టేశారు. విరాట్ కోహ్లీని ఎరుపు రంగు జెర్సీలో చూడడం ఇష్టం లేకనే ట్విట్టర్ ఇలా చేసిందని అంటున్నారు నెటిజన్లు...
undefined
గత 8 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న విరాట్ కోహ్లీ, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు... ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు లోగో, జెర్సీ డిజైన్‌లో మార్పులు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు...
undefined
ప్రతీ సీజన్‌ మొదలుకాకముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ అభిమానులు హడావుడి చేయడం, లీగ్ ప్రారంభమైన తర్వాత నిరాశజనిత ఆటతీరుతో ఫ్యాన్స్ ఉత్సాహం ఆవిరైపోవడం ఆనవాయితీగా మారింది..
undefined
2020 సీజన్ ఆరంభంలో ఆడిన 9 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో వరుసగా ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది...
undefined
అందుకే మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడితే, ఐపీఎల్ టైటిల్ ఎలా గెలవాలో నేర్చుకుంటాడని ట్విట్టర్ ఈ విధంగా చేసిందని ట్రోల్ చేస్తున్నారు భారత సారథి అంటే పడని కొందరు క్రికెట్ ఫ్యాన్స్...
undefined
అయిత విరాట్ ఫ్యాన్స్, దీన్ని అదే రీతిలో తిప్పికొడుతున్నారు. గత సీజన్‌లో ఏడో స్థానానికి పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు చూసి, ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య తేడా తెలియక ట్విట్టర్ తికమక పడి ఉంటుందని అంటున్నారు...
undefined
మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ ఎవ్వరూ ఊహంచి ఉండరని, కనీసం తాము ప్లేఆఫ్ చేరామని కామెంట్ చేస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు...
undefined
ఎరుపు రంగు వల్ల విజయం దక్కడం లేదనే ఉద్దేశంతో ట్విట్టర్ కావాలనే దానిపై పసుపు రంగు చల్లిందని... రజినీకాంత్ ‘నరసింహా’లో సౌందర్య ఎర్రచీరపై పసుపు నీళ్లు చల్లుతున్న సీన్‌ని జోడించి, మీమ్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు..
undefined
click me!