ఆ ఇద్దరిపై లంక సిరీస్ ఎఫెక్ట్... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో...

First Published Jul 17, 2021, 5:11 PM IST

భారత జట్టు ఒకే సమయంలో రెండు విభిన్నమైన టూర్లలో, రెండు విభిన్న ప్రత్యర్థులతో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. లంక సిరీస్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్, జూలై 18న ప్రారంభం కానుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఇంగ్లాండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పడనుంది...

నెం.1 బ్యాట్స్‌మెన్‌గా 1258 రోజులకు పైగా ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీ, కొన్నిరోజుల కిందట పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కారణంగా రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఫెయిల్ అయినా, మూడో వన్డేలో 158 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు...
undefined
ప్రస్తుతం విరాట్ కోహ్లీకి వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 857 పాయింట్లు ఉండగా, బాబర్ ఆజమ్ 873 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ 825 పాయింట్లతో టాప్ 3లో ఉన్నాడు...
undefined
లంకతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనని కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో చెరో 25 పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుంది...
undefined
ఐసీసీ ర్యాంకింగ్స్ రూల్స్ ప్రకారం జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఆడాలి. ఆడి చేసిన పరుగుల ఆధారంగా అతని ఖాతాలో పాయింట్లు చేరతాయి. లేదంటే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది...
undefined
ప్రస్తుతం 857 పాయింట్లతో ఉన్న 25 పాయింట్లు కోల్పోయినా, రెండో ర్యాంకులోనే కొనసాగుతాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం మరో 25 పాయింట్లు కోల్పోతే, నాలుగో స్థానంలో ఉన్న రాస్ టేలర్ (801 పాయింట్లు) కంటే వెనకబడతాడు.
undefined
టాప్ 10లో భారత జట్టు తరుపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఉండగా, ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో ఉన్న శిఖర్ ధావన్‌కి ఈ టూర్ కలిసి రావచ్చు...
undefined
అతను మూడు వన్డేల్లో అద్భుతంగా రాణిస్తే, టాప్ 10లోకి కూడా ఎంట్రీ ఇవ్వవచ్చు. అలాగే ఆ తర్వాత టీ20 సిరీస్‌లోనూ పాల్గొనని కారణంగా విరాట్ కోహ్లీ పాయింట్లు కోల్పోతే టాప్ 5 నుంచి కిందకి జారే అవకాశం కూడా ఉంది.
undefined
click me!