సంజూ శాంసన్‌ని సరిగ్గా వాడుకోవాలంటే, ఆ ప్లేస్‌లో ఆడించండి... టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సలహా..

Published : Aug 24, 2023, 11:08 AM IST

కేరళ రాష్ట్రంలో ఫుట్‌బాల్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే కేరళ నుంచి టీమిండియాకి ఆడే క్రికెటర్లు సంఖ్య చాలా తక్కువ. అయితే కొన్నేళ్లుగా కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్ గురించి టీమిండియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది..  

PREV
18
సంజూ శాంసన్‌ని సరిగ్గా వాడుకోవాలంటే, ఆ ప్లేస్‌లో ఆడించండి... టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సలహా..

ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌గా శ్రీలంకకు వెళ్లబోతున్నాడు సంజూ శాంసన్. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటిదాకా స్థిరమైన చోటు దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు సంజూ శాంసన్...

28

క్రీజులోకి వచ్చిన తర్వాత మొదటి బంతి నుంచి అటాకింగ్ పద్ధతినే అనుసరించే సంజూ శాంసన్, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 40 పరుగులు చేసి మెప్పించినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు..

38

8 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సంజూ శాంసన్ ఇప్పటిదాకా ఆడింది 24 టీ20 మ్యాచులు, 13 వన్డేలు మాత్రమే. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌ని కూడా ఆసియా కప్‌కి ఎంపిక చేసిన సెలక్టర్లు, సంజూ శాంసన్‌ని మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేయడం తీవ్ర దుమారం రేపింది..

48

సంజూ శాంసన్‌ని కాదని, రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇవ్వడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2016-17 రంజీ సీజన్‌లో ఓ త్రిబుల్ సెంచరీతో 81 యావరేజ్‌తో 972 పరుగులు చేశాడు రిషబ్ పంత్. ఇదే సీజన్‌లో ఇషాన్ కిషన్ కూడా 57.07 సగటుతో 799 పరుగులు చేశాడు. సంజూ మాత్రం ఆ సీజన్‌లో 334 పరుగులే చేశాడు..

58
Sanju Samson

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో ఫెయిల్ అవుతున్న సంజూ శాంసన్, వన్డేల్లో మాత్రం 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. సంజూ శాంసన్‌ని టీ20ల్లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపడం కూడా చర్చనీయాంశమైంది..

68
Sanju Samson

‘సంజూ శాంసన్‌ని మీరు సరిగ్గా వాడుకోవాలని అనుకుంటే, అతనికి సరైన బ్యాటింగ్ పొజిషన్ ఇవ్వండి. నెం.3లో లేదా నెం.4లో సంజూ శాంసన్ సరిగ్గా సెట్ అవుతాడు. లేదంటే ఓపెనర్‌గా పంపొచ్చు. కానీ వెస్టిండీస్ టూర్‌లో సంజూ శాంసన్‌ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపారు...

78

సంజూ శాంసన్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ కాదు. అతను టాపార్డర్‌లో మాత్రం సెట్ అయ్యే ప్లేయర్. సంజూ శాంసన్‌ సక్సెస్ కావాలంటే రిషబ్ పంత్‌ విషయంలో చూపించినట్టే కాస్త ఓపిక చూపించాలి. ఒక్కసారి అతను అంతర్జాతీయ టీమ్‌లో సెటిల్ అయితే పరుగుల వరద పారించగలడు..

88

అంతర్జాతీయ టీమ్‌లో సెటిల్ అయిన తర్వాత నెం.6లో పంపినా, నెం.7లో పంపినా ఆఖరికి నెం.11లో బ్యాటింగ్‌కి పంపినా సులువుగా పరుగులు చేయగలడు. అలా జరగాలంటే అతనికి కావాల్సిన స్పేస్ ఇవ్వాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్.. 

click me!

Recommended Stories