నన్ను టీమ్‌లో నుంచి కూడా తీసేస్తారని భయమేసింది... విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...

Published : Mar 02, 2023, 09:50 AM IST

కెప్టెన్‌గా 2008 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన ఏడాదిలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి నిలకడైన ప్రదర్శనతో టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా, కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు. ధోనీ తర్వాత టీమిండియాకి కెప్టెన్‌గా మారి, టెస్టుల్లో నెం.1 టీమ్‌గా నిలబెట్టాడు...

PREV
18
నన్ను టీమ్‌లో నుంచి కూడా తీసేస్తారని భయమేసింది... విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...
Image credit: Getty

దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఐసీసీ నుంచి ‘క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు అందుకున్నాడు. బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డులనే టార్గెట్ చేస్తూ సాగుతున్న విరాట్ కోహ్లీ, టీమ్‌లో ప్లేస్ పోతుందని భయపడ్డాడా?
 

28
Image credit: PTI

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విరాట్ కోహ్లీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘2012లో పెర్త్‌లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వెళ్లాం. పిచ్ చూడడానికి ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అని అర్థమైపోయింది. బౌన్స్ కూడా చక్కగా వస్తోంది. పచ్చని గడ్డి చూస్తుంటే బ్యాటింగ్ చేయడం కష్టమని అర్థమైపోయింది...

38
Image credit: PTI

ఆ టెస్టులో బాగా ఆడకపోతే నాకు మరో ఛాన్స్ ఉండదు... మళ్లీ వెళ్లి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడుకోవాల్సింది ఉంటుందని భయమేసింది... ఆ భయంతోనే ఆడాను.  సిడ్నీ మ్యాచ్ అయ్యాక పెర్త్‌కి వెళ్లే సమయానికి టీమ్ వాతావరణం అస్సలు బాలేదు...
 

48
Image credit: PTI

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడాం. టీమ్‌లోని ప్లేయర్లు అందరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. అది నాకు ఫస్ట్ ఆసీస్ టూర్. సీనియర్ ప్లేయర్లను అలా చూశాక నాకు టీమ్‌లో ప్లేస్ ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని మాత్రం అర్థమైంది..
 

58

అప్పటికి నాకు అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగేళ్ల అనుభవం మాత్రమే ఉంది. నేను ఈ పరిస్థితి ఎలా మార్చగలనని ఆలోచించా. టీమ్‌లో ఉంటే నా మెంటల్ పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నా... ‘ఆగు... నువ్వు మిగిలినవారి కంటే భిన్నమైన వాడివి. కాబట్టి భిన్నంగానే ఆలోచించు...’ అని నాకు నేనే చెప్పుకున్నా..

68

నాతో నేను ఎక్కువ సమయం గడిపేవాడిని. నా ఓన్ స్పేస్‌ని నిర్మించుకున్నా. గ్రౌండ్‌లో ఎక్కువసేపు నడవడానికి సమయం కేటాయించేవాడిని. కాఫీ షాపుకి ఒంటరిగా వెళ్లి కాఫీని ఎంజాయ్ చేసేవాడిని.  టీమ్ బస్సులో వెళ్లేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వినేవాడిని...

78

అప్పటికే నాకు వన్డేల్లో 8 సెంచరీలు ఉన్నాయి. ఆ విషయాన్ని మరిచిపోకని గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. నన్ను నేను పాజిటివ్ మూడ్‌లోకి తెచ్చుకున్నా. ఆ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశా, రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేశా...

88

అలాంటి పరిస్థితుల్లో చేసిన ఆ పరుగులు సెంచరీల కంటే ఎక్కువే. ఆ టెస్టులో నేను టీమిండియాకి నేనే టాప్ స్కోరర్‌ని. అది నన్ను నేను గొప్పగా చూసుకోవడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని అందించింది. ఆ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. నన్ను నేను నమ్ముతాను. నా ఆత్మవిశ్వాసమే నా బలం...’ అంటూ ఆర్‌సీబీ పాడ్‌‌కాస్ట్‌లో బయటపెట్టాడు విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories