Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ

Published : Sep 28, 2026, 08:59 PM IST

Virat Kohli: 2027 వన్డే ప్రపంచకప్ తనకు చివరి వరల్డ్ కప్ కానుందని రన్ మిషన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు. రోహిత్ శర్మ కూడా ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తన రిటైర్మెంట్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

PREV
15
వరల్డ్ కప్ 2027పై విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన

భారత క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ బిగ్ షాక్ ఇచ్చాడు. రాబోయే 2027 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ భారతదేశం తరఫున తనకు ఆఖరిది కానుందని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. 2011లో భారత్ లో జరిగిన ప్రపంచకప్‌తో వన్డే వరల్డ్ కప్ కెరీర్ ప్రారంభించిన కోహ్లీ, ఆ ఏడాది ధోనీ సారథ్యంలో శ్రీలంకను ఓడించి ట్రోఫీ గెలిచిన చరిత్రాత్మక జట్టులో భాగమయ్యాడు. ఇప్పటివరకు 2011, 2015, 2019, 2023 లలో నాలుగు వన్డే వరల్డ్ కప్‌లు ఆడిన కింగ్ కోహ్లీ, తన చివరి ప్రపంచకప్‌ను కప్ గెలుపుతో ముగించాలని పట్టుదలతో ఉన్నాడు.

25
అకస్మాత్తుగా మైండ్ బ్లాకింగ్ స్టేట్‌మెంట్

వెస్ట్రండీస్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జియో-హాట్‌స్టార్‌తో మాట్లాడిన కోహ్లీ తన ప్లాన్స్ బయటపెట్టాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తన శక్తినంతా ధారపోసి సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. 2027 టోర్నీ భారతదేశం తరఫున తనకు చివరి ప్రపంచకప్ అని, ఎలాగైనా ట్రోఫీ గెలవడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశాడు. ఈ డ్రీమ్ రీచ్ అవ్వడానికి ఎలాంటి కష్టానికైనా తాను రెడీ అని వెల్లడించాడు.

35
50 ఓవర్ల ఫార్మాట్ అంటే మామూలు విషయం కాదు

ఈ సందర్బంగా వన్డే వరల్డ్ కప్ ప్రాముఖ్యతను కోహ్లీ వివరించాడు. "50 ఓవర్ల వరల్డ్ కప్‌లో ఉండే ఇంటెన్సిటీ వేరే లెవల్‌లో ఉంటుంది. టీ20 వరల్డ్ కప్‌లో దాదాపు 10 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒకే రోజులో 2.5 టీ20 మ్యాచ్‌లకు సమానంగా కష్టపడాలి. అంత పెద్ద టోర్నీలో అంత ఇంటెన్సిటీ కంటిన్యూ చేయడం చాలా పెద్ద విషయం" అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈసారి విదేశీ పిచ్‌లపై మ్యాచ్‌లు జరగడం వల్ల శక్తి మరింత ఖర్చవుతుందని తెలిపాడు.

"నాకు ఇది భారత్ తరఫున ఆఖరి వరల్డ్ కప్, అదే నన్ను ముందుకు నడిపించే మోటివేషన్. మైదానంలో నా బెస్ట్ ఇవ్వడమే కాకుండా కప్ గెలవడమే మెయిన్ టార్గెట్" అని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 315 వన్డేలు ఆడిన విరాట్ 15080 పరుగులు సాధించాడు. 55 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు బాదాడు.

45
వరల్డ్ కప్ రికార్డుల్లో కింగ్ హవా

వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఏకంగా 765 పరుగులు చేసి రికార్డుల వేట సాగించాడు. ఆ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

55
రోహిత్ శర్మ ప్లాన్స్ ఏంటి?

విరాట్ కోహ్లీతో పాటు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే కోరికను ఇప్పటికే వ్యక్తం చేశాడు. రాబోయే సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు రోహిత్ కూడా వెల్లడించాడు. "నా పని పూర్తయిందని నేను ఎప్పుడూ అనుకోను. ఎంతకాలం ఆడినా ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. వరల్డ్ కప్ ఆడటం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా" అని రోహిత్ అన్నాడు.

ఐసీసీ టోర్నీల్లో విభిన్నమైన టీమ్‌లతో, వేర్వేరు పిచ్‌లపై ఆడాల్సి రావడం పెద్ద ఛాలెంజ్ అని తెలిపాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 ప్రపంచకప్‌లో ఆడితే అది వారి వన్డే కెరీర్‌లోనే ఒక ఐకానిక్ మూమెంట్ కానుంది. టీ20లకు వీడ్కోలు పలికినట్టు ఈ మెగా టోర్నీ తర్వాత వీరిద్దరూ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories