శ్రేయాస్ అయ్యర్‌ ఇలా బౌలింగ్ చేస్తుంటే వాడుకోడానికి భయమేంటి? టీమిండియాకి మరో బౌలింగ్ ఆప్షన్...

First Published Jan 16, 2023, 6:14 PM IST

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసేసింది టీమిండియా. తొలి వన్డేలో పోరాడి ఓడిన శ్రీలంక, రెండో వన్డేలో టీమిండియాకి చుక్కులు చూపించింది. అయితే మూడో వన్డేలో ఏ మాత్రం పోరాడకుండానే చేతులు ఎత్తేసింది. ఫలితంగా భారత జట్టుకి 317 పరుగుల తేడాతో రికార్డు విజయం దక్కింది...
 

team india

మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ని కకావికలంచేసేశాడు. లంక ఓపెనర్లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్‌ని అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్.. వానిందు హసరంగని క్లీన్ బౌల్డ్ చేశాడు.. ఓ రనౌట్‌తో స్టార్ పర్ఫామెన్స్ ఇచ్చాడు..

Image credit: PTI

39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక, ఏడో వికెట్‌కి 11 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్‌కి 22 పరుగుల భాగస్వామ్యం రావడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి...
 

Image credit: PTI

శ్రీలంక ఇన్నింగ్స్ 22 ఓవర్లలోనే ముగిసిపోవడంతో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లకు బౌలింగ్ కూడా రాలేదు. శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి 2 పరుగులు ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ వేసిన బాల్ టర్న్‌ని చూసి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ షాక్ అవ్వడం టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది...
 

Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్ ఇంతకుముందు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో బౌలింగ్ కూడా చేశాడు. ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ తీయలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మాత్రం 4 వికెట్లు పడగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ చూసిన వారంతా అతన్ని బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా వాడుకోవాలని కామెంట్లు చేస్తున్నారు...

Image credit: Getty

శ్రేయాస్ అయ్యర్ మాత్రమే కాకుండా టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ పేస్ బౌలింగ్, రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా గుర్తింపు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వికెట్ తీసిన ఆఖరి భారత బౌలర్ విరాట్ కోహ్లీయే...

Virat Kohli-Rohit Sharma

అయితే ఈ ఇద్దరూ బౌలింగ్ చేయడానికి అస్సలు ఇష్టపడడం లేదు.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,  సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తీసుకునేవరకూ బౌలింగ్ చేయడానికి ఇష్టపడేవాళ్లు. అయితే ఇప్పుడు భారత బ్యాటర్లు మాత్రం బౌలింగ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం భారత జట్టుని ఇబ్బందిపెడుతోంది.. 

click me!