భారత పర్యటనలో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన శ్రీలంక జట్టు, వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది. ముఖ్యంగా తిరువనంతపురంలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు ఏకంగా 317 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది...
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకి శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగి 390 పరుగుల భారీ స్కోరు అందించారు. శుబ్‌మన్ గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
27
Image credit: PTI
తొలి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు. 85 బంతుల్లో సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 25 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మరో రెండు మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీని అందుకునేవాడే...
37
Team India vs SL Mohammad Siraj Celebration
391 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టు ఏ దశలోనూ టార్గెట్ వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. నువనిడు ఫెర్నాండో 19, కసున్ రజిత 13, దసున్ శనక 11 పరుగులు చేయడం మినహా బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు...
47
తొలి వన్డేలోనూ టీమిండియా 373 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే లక్ష్యఛేదనలో శ్రీలంక 300+ పరుగులు చేయగలిగింది. అయితే మూడో వన్డేలో మాత్రం 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయ్యి వన్డే క్రికెట్ చరిత్రలో అతి చెత్త రికార్డు మూటకట్టుకుంది...
57
Image credit: PTI
బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై లంక బ్యాటర్లు పట్టుమని 20 బంతులు ఎదుర్కోవడానికి కూడా తెగ ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ 166 పరుగులు చేస్తే, లంక జట్టు మొత్తం కలిసి అందులో సగం స్కోరు చేయలేకపోయింది..
67
Image credit: PTI
మరీ ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణాలేంటో చెప్పాలని శ్రీలంక జట్టుకి అల్టీమేటం జారీ చేసింది లంక క్రికెట్ బోర్డు. మరీ ఇంత చెత్తగా ఎందుకు ఓడాడో? ఏం జరిగిందో వివరణ ఇవ్వాల్సిందిగా లంక కెప్టెన్ దసున్ శనక, హెడ్ కోచ్‌తో పాటు సెలక్షన్ కమిటీకి నోటీసులు పంపించింది లంక బోర్డు...
77
ప్రతీ ఆటలో గెలుపు ఓటములు సహజం. ఇండియాలో శ్రీలంక జట్టుకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. అయితే కనీసం 100+ పరుగులు కూడా చేయకపోవడం మాత్రం క్షమించరాని నేరంగా పరిగణిస్తోంది లంక బోర్డు...