హైదరాబాద్ మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడి పరిస్థితి చూసి చలించిన భారత సారథి విరాట్ కోహ్లీ...

First Published May 21, 2021, 4:35 PM IST

భారత మాజీ వుమెన్ క్రికెటర్ కెఎస్ స్రవంతి నాయుడి తల్లిదండ్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తన పేరెంట్స్‌ను కరోనా నుంచి కాపాడుకునేందుకు దాతల నుంచి విరాళాలు కోరుతూ భారత కోచ్ ఆర్ శ్రీధర్ పోస్టు చేశారు.. ఆమె పోస్టుకి భారత సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు.

హైదరాబాద్‌కి చెందిన భారత మాజీ మహిళా క్రికెటర్‌ స్రవంతి నాయుడు తల్లిదండ్రుల వైద్యానికి తనవంతు సాయంగా రూ.6.77 లక్షల రూపాయలను పంపించాడట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
undefined
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కూడా స్రవంతి నాయుడికి రూ.5 లక్షలు విరాళం ఇవ్వగా, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఎఫ్‌ఐ) ప్రెసిడెంట్ అర్షినపల్లి జగన్ మోహన్ రావు రూ.2 లక్షలు అందచేశాడు.
undefined
మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడి ఆర్థిక కష్టాల గురించి తెలుసుకున్న భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్. శ్రీధర్ ట్వీట్‌తో హెచ్‌సీఏ వెంటనే స్పందించింది..
undefined
‘మాజీ టీమిండియా, హైదరాబాద్ క్రికెటర్ స్రవంతి నాయుడి తల్లిదండ్రులు కరోనాతో పోరాడుతున్నారు. ఇప్పటికే ఆమె రూ.16 లక్షలు వారి వైద్యానికి ఖర్చు చేసింది. ఆసుపత్రి ఖర్చులు భరించేందుకు ఆమెకు డబ్బుల అత్యవసరం’ అంటూ ట్వీట్ చేశాడు ఆర్. శ్రీధర్.
undefined
ఆర్. శ్రీధర్ ట్వీట్‌కి వెంటనే స్పందించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, స్రవంతి నాయుడికి ఫోన్ చేసి ఆమెకు అవసరమైన సాయం చేసేందుకు విరాళాల సేకరణ మొదలెట్టారు. అయితే విహారి చేపట్టిన ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ద్వారా రూ.80 వేలు వసూలు అయ్యాయి.
undefined
బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల, భారత క్రికెటర్ వేదా కృష్ణమూర్తితో పాటు స్రవంతి నాయుడికి సపోర్ట్ చేయాల్సిందిగా పోస్టులు చేశారు. ‘మా అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నాన్న ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. వారిద్దరూ ప్రాణాలు కోసం యుద్ధం చేస్తున్నారు. వెంటనే స్పందించిన హెచ్‌సీఏకి ధన్యవాదాలు’ అంటూ తెలిపింది స్రవంతి...
undefined
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఉన్న సమయంలో ఆంధ్రాకి ఆడిన స్రవంతి నాయుడు, హైదరాబాద్ తరుపున కూడా మ్యాచులు ఆడింది. 2004లో టీమిండియాకి ఆడిన స్రవంతి నాయుడు, 11 మ్యాచులు ఆడింది. ఇందులో ఓ టెస్టు, నాలుగు వన్డేలు, ఆరు టీ20 మ్యాచులు ఉన్నాయి.
undefined
click me!