ఆస్ట్రేలియా కూడా చేయలేనిది, టీమిండియా చేస్తోంది... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ కామెంట్స్...

First Published May 21, 2021, 3:09 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్‌కి 24 మందితో కూడిన జట్టును పంపిస్తున్న టీమిండియా, అదే సమయంలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ కోసం మరో జట్టును లంకకు పంపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్, భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు...

‘ఇప్పుడు టీమిండియా రిజర్వు బెంచ్ బలం చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఓ వైపు 24 మంది ప్లేయర్లు ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తుంటే... మరో జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది... ఒకేసారి రెండు పటిష్టమైన జట్లను తయారుచేయడమంటే ఆశామాషీ కాదు...
undefined
ఆస్ట్రేలియా జట్టు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. ఆసీస్‌తో సిరీస్ ఆడాలంటేనే మిగిలిన జట్లు ఓటమి ఖాయమని ఫిక్స్ అయిపోయేవి. అయినా వాళ్లు ఎప్పుడూ ఒకేసారి రెండు జట్లతో రెండు విభిన్న సిరీస్‌లు ఆడలేకపోయారు. టీమిండియా దాన్ని సాధ్యం చేసి చూపించబోతోంది...
undefined
నాకు తెలిసి క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి.... 1990-2010 సమయంలో ఆస్ట్రేలియా చాలా పటిష్టమైన జట్టుగా ఉండేది. ఆ సమయంలో ఆసీస్ జట్టును రెండు విభిన్న టీమ్‌లుగా మార్చాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు...
undefined
నా అంచనా ప్రకారం టీమిండియా ఇప్పుడు రెండు కాదు, ఏకంగా నాలుగు పటిష్టమైన జట్లను తయారుచేయగలదు. ఏకంగా 50 మంది ఆటగాళ్లు టీమిండియా దగ్గర సిద్ధంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్...
undefined
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా తొలి మ్యాచ్ ఆడుతున్నామనే భయం, ఆందోళన, ఒత్తిడి యువ క్రికెటర్లలో అసలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మ్యాచులను కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల్లాగే ఆడేస్తున్నారు’ అంటూ కామెంట్ చేశాడు ఇంజమామ్ వుల్ హక్...
undefined
జూన్ 18 నుంచి 22 వరకూ న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అండ్ టీమ్... ఆ తర్వాత అక్కడే ఉండి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది...
undefined
అదే సమయంలో యువకులతో కూడిన మరో జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. హార్ధిక్ పాండ్యా లేదా శిఖర్ ధావన్ లేదా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ సిరీస్ కోసం దాదాపు 25 మందితో కూడిన జట్టును త్వరలో ప్రకటించనుంది బీసీసీఐ.
undefined
ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, జయంత్ యాదవ్, నటరాజన్, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహార్, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లు ఉండే అవకాశం ఉంది.
undefined
click me!