అప్పుడే రోహిత్ శర్మ తనకు పోటీ వస్తాడని కనిపెట్టిన విరాట్ కోహ్లీ... ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే...

First Published Dec 9, 2021, 4:33 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో జరుగుతున్న పరిమాణాలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోగా, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ బలవంతంగా తప్పించిందనే వార్తలు, సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి...

విరాట్ కోహ్లీ కంటే ముందుగానే భారత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, టీమ్‌లో స్థిరమైన సంపాదించుకోవడానికి చాలా కాలమే పట్టింది... విరాట్ ఆరంగ్రేటంతోనే టీమ్‌లో పర్మినెంట్ ప్లేస్ కొట్టేస్తే, రోహిత్‌కి ఆరేళ్లు పట్టింది...

2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, అదే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు..

అది మొదలు, రోహిత్ శర్మకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వన్డే, టీ20ల్లో స్టార్ ప్లేయర్‌గా మారిన రోహిత్ శర్మ, తాజాగా వన్డే కెప్టెన్సీతో పాటు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌ పదవి కూడా దక్కించుకున్నాడు...

అయితే రోహిత్ శర్మ, తన కెప్టెన్సీ పదవికి పోటీ వస్తాడని విరాట్ కోహ్లీ దాదాపు 8 ఏళ్ల క్రితమే గ్రహించాడంటే నమ్మగలరా? అవును, ఇది నిజం... 2013 ఐపీఎల్ సమయంలోనే విరాట్ ఈ విధంగా కామెంట్లు చేశాడు..

‘రోహిత్‌కి అద్భుతమైన క్రికెట్ నాలెడ్జ్ ఉంది. కొన్నిసార్లు నేను కూడా అతని దగ్గరి నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటాను. ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తూ కెప్టెన్‌గానూ నిరుపించుకున్నాడు...

ఎమ్మెస్ ధోనీ తర్వాత టీమిండియాను లీడ్ చేసే విషయంలో నాకు పోటీ వచ్చే ప్లేయర్ రోహిత్ శర్మనే...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

2008లో జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 2012లో వైస్ కెప్టెన్‌గా మారడు. ఆ తర్వాతి ఏడాదే ఎమ్మెస్ ధోనీ టెస్టు రిటైర్మెంట్‌తో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

2017లో ఎమ్మెస్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ కెప్టెన్‌‌గా తప్పుకోవడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నారు...

తన కెరీర్‌లో 95 వన్డే మ్యాచుల్లో 65 విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్‌గా 5449 పరుగులు చేసి, సారథిగా అత్యుత్తమ సగటు 72.65 నమోదుచేశాడు...

click me!