కేన్ విలియంసన్ గొప్ప కెప్టెన్ అయితే, విరాట్ కోహ్లీ అంతకుముందు... బీసీసీఐని తీవ్రంగా ట్రోల్ చేస్తూ...

First Published Dec 9, 2021, 4:02 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం... భారత అభిమానుల్లో ఆగ్రహా జ్వాలలను రేపింది. ప్రపంచ క్రికెట్‌లో మోడ్రన్ క్రికెట్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీని ఇలా అవమానించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియా జనాలు, బీసీసీఐని తీవ్రంగా విమర్శిస్తున్నారు...

న్యూజిలాండ్ జట్టు ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియంసన్‌ గొప్ప కెప్టెన్ అయితే, విరాట్ కోహ్లీ అంతకుమించి బెస్ట్ కెప్టెన్ అంటూ ఇద్దరి గణాంకాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు...

వన్డేల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 70 శాతం విజయాలు అందుకోగా, కేన్ విలియంసన్ వన్డే కెప్టెన్సీ విజయాల శాతం 55 మాత్రమే. కేన్ విలియంసన్ కూడా వన్డే వరల్డ్ ‌కప్ టైటిల్ గెలిచింది లేదు...

న్యూజిలాండ్‌, భారత జట్టును ఓడించి డబ్యూటీసీ ఫైనల్ గెలిచింది. అయితే టేబుల్ టాపర్‌గా ఫైనల్‌కి అర్హత సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తక్కువ చేసి చూడకూడదు...

వన్డే, టీ20ల్లో ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయినా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో పాటు యావత్ ప్రపంచం కేన్ విలియంసన్‌ను గ్రేట్ కెప్టెన్ అంటుంటే, 70 శాతం విజయాల రికార్డు ఉన్న విరాట్ కోహ్లీని బీసీసీఐ ఇలా కెప్టెన్సీ నుంచి తొలగించడం సిగ్గుచేటని... ‘Shame on BCCI’హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, ప్రపంచ మీడియా ఆకాశానికి ఎత్తుతూ వేనోళ్ల పొడుగుతుంటే... భారత క్రికెట్ బోర్డు మాత్రం కెప్టెన్‌గా పనికిరాడంటూ తప్పించడం ఎంత వరకూ సమంజసం అంటున్నారు అభిమానులు...

క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ లెజెండ్, నోవాక్ జొకోవిచ్ వంటి టెన్నిస్ లెజెండ్ కూడా విరాట్ కోహ్లీ ఆటకు, అతని కెప్టెన్సీకి మంత్రముగ్ధులు అవుతుంటే, బీసీసీఐ ‘కింగ్’ కోహ్లీతో వ్యవహరించిన విధానం సిగ్గుచేటని తిట్టిపోస్తున్నారు...

తన కెప్టెన్సీ కెరీర్‌లో 59.52 శాతం విజయాలు అందుకున్న ఎమ్మెస్ ధోనీని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చెబుతున్నప్పుడు, 70.43 శాతం విజయాలు అందుకున్న విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలో ఏం లాజిక్ ఉందో అర్థం కావడం లేదని ట్రోల్ చేస్తున్నారు...

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో మరోసారి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కనిపించింది...

ఇప్పుడు ఎమ్మెస్ ధోనీ ఉండి ఉంటే, విరాట్ కోహ్లీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని, మహేంద్రుడు, విరాట్‌ని నమ్మినట్టుగా... బీసీసీఐ నమ్మడం లేదని చెబుతున్నారు ఫ్యాన్స్...

అయితే మరికొందరు అభిమానులు మాత్రం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెటర్లు ఐదారుగురు కెప్టెన్ల సారథ్యంలో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ, మరో ప్లేయర్ కెప్టెన్సీలో ఆడడంలో తప్పేంటని, అయితే విరాట్ కోహ్లీని ఈ విధంగా తప్పించడం మాత్రం కరెక్ట్ కాదని బీసీసీఐ ధోరణిని ట్రోల్ చేస్తున్నారు...

click me!