డేవిడ్ వార్నర్‌కి పట్టిన గతే, విరాట్ కోహ్లీకి పట్టనుందా... సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసినట్టే, టీమిండియా కూడా..

First Published Dec 9, 2021, 3:22 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం, క్రికెట్ ప్రపంచంలో పెను సందేహాలను, అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- డేవిడ్ వార్నర్‌తో లింకు పెట్టి చూస్తున్నారు కొందరు అభిమానులు...

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత జట్టు కంటే ఎక్కువగా అభిమానించి, తన టీమ్‌గా భావించాడు డేవిడ్ వార్నర్...

2014 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి వచ్చిన డేవిడ్ వార్నర్, అప్పటి నుంచి ఐపీఎల్‌లో గత ఆరు సీజన్లలోనూ (2018 సీజన్‌లో బ్యాన్ కారణంగా ఆడలేదు) 500+ పరుగులు చేశాడు...

2016లో కెప్టెన్‌గా టైటిల్ అందంచడమే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా 848 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్, 195 పరుగులతో పెద్దగా రాణించలేకపోయాడు. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ మేనేజ్‌మెంట్‌కీ, డేవిడ్ వార్నర్‌కీ మధ్య తెగతెంపులు జరిగేదాకా వెళ్లింది...

ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. కెప్టెన్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక విజయాల శాతం నమోదు చేశాడు...

వన్డే కెప్టెన్‌గా 2017, 2018, 2019 సీజన్లలో 1000+ పరుగులు చేసి, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి నాయకుడిగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ మధ్య ఆ ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత  వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగాలని విరాట్ కోహ్లీ భావించినా అతని బ్యాటింగ్ పర్ఫామెన్స్‌ని కారణంగా చూపిస్తూ, ఆ పదవి నుంచి తప్పించింది బీసీసీఐ...

డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి, టీమ్ నుంచి తప్పించినప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వచ్చినట్టుగానే ఇప్పుడు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఒకే ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడని, అతన్ని టీమ్ నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్. విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతుందా? అని అనుమానిస్తున్నారు అభిమానులు...

ఐపీఎల్‌ కాబట్టి డేవిడ్ వార్నర్‌కి ఒకే అవకాశం ఇచ్చారని, టీమిండియాలో విరాట్ కోహ్లీ రెండు మూడు అవకాశాలిచ్చి, వాటిల్లో ఫెయిల్ అయితే తీసి పక్కనబెట్టడం గ్యారెంటీ అంటూ అంచనా వేస్తున్నారు... 

click me!