పాక్ సూపర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ ఫోటోలు... సెంచరీ రాకపోయినా తగ్గని క్రేజ్...

Published : Feb 18, 2022, 07:37 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు విరాట్ కోహ్లీకి మించిన స్టార్ మరొకరు లేరు. సోషల్ మీడియాలో వందల కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్ కోహ్లీకి ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు... పాక్‌లోనూ విరాట్ ఫ్యాన్స్‌ సంఖ్య తక్కువేమీ లేదు...  

PREV
18
పాక్ సూపర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ ఫోటోలు... సెంచరీ రాకపోయినా తగ్గని క్రేజ్...

పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడనే సంతోషంలో పాక్‌లో ఉన్న ఓ అభిమాని, తన ఇంటిపైన టీమిండియా జెండా ఎగరవేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది...

28

తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ 7లో జరుగుతున్న మ్యాచ్‌లో స్టేడియంలో విరాట్ కోహ్లీ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. పీఎస్‌ఎల్ 2022 మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తోంది పాకిస్తాన్..

38

కరాచీతో పాటు లాహోర్ వేదికగా పీఎస్‌ఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ మధ్య విరాట్ కోహ్లీ పోస్టర్లు కనిపించాయి...

48

పాక్‌లో విరాట్ కోహ్లీ ఫోటోలు ప్రత్యేక్షం కావడంతో సోషల్ మీడియాలో వీటి గురించి చర్చ జరుగుతోంది. పాక్ క్రికెట్ ఫ్యాన్స్, తాము విరాట్ కోహ్లీ ఆటను ఇష్టపడతామని, అతను ఇక్కడ కూడా ‘కింగ్’ కోహ్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు...

58

క్రికెట్‌ని అమితంగా ఇష్టపడే పాకిస్తాన్‌లో పాక్ క్రికెటర్లతో పాటు పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఆడే విదేశీ క్రికెటర్లకు కూడా అభిమానులు ఉంటారు...

68

అయితే శత్రుదేశంగా భావించే భారత క్రికెటర్‌కి పొరుగు రాష్ట్రంలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు కొందరు నెటిజన్లు...

78

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు నమోదుచేసి, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఛేదించిన విరాట్ కోహ్లీ... రెండున్నరేళ్లుగా శతకాన్ని అందుకోలేకపోయాడు...

88

జనవరి 27న మొదలైన పాక్ సూపర్ లీగ్ 2022 సీజన్, ఫిబ్రవరి 27 వరకూ సాగనుంది. ముల్తాన్ సుల్తాన్ జట్టు 8 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని టాప్‌లో ఉండగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని కరాచీ కింగ్స్ 8 మ్యాచులాడి 8 మ్యాచుల్లోనూ ఓడింది. 

Read more Photos on
click me!

Recommended Stories