విండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. త్వరలో శ్రీలంక సిరీస్‌కి జట్టుని ప్రకటించబోతోంది బీసీసీఐ...
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ద్వారా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...
28
నవంబర్ 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజా... మూడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...
38
ఇప్పటికే లక్నోకి చేరుకున్న రవీంద్ర జడేజా, బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. జడ్డూకి చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది...
48
రవీంద్ర జడేజాతో పాటు జస్ప్రిత్ బుమ్రా కూడా శ్రీలంక సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీరితో పాటు మహ్మద్ షమీ కూడా భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం...
58
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నుంచి వరుసగా మ్యాచులు ఆడుతున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని ఆలోచిస్తోందట బీసీసీఐ...
68
టీ20 సిరీస్‌లో రెస్ట్ ఇచ్చినా, టెస్టు సిరీస్‌కి తిరిగి భారత జట్టుతో కలిసే విరాట్ కోహ్లీ, మార్చి 3న మొహాలీలో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడతాడు...
78
అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఈ ఇద్దరినీ రంజీ ట్రోఫీలో పాల్గొనాల్సిందిగా సూచించింది బీసీసీఐ...
88
రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్న ఈ ఇద్దరినీ పక్కనబెట్టి వారి స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్లను టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయాలని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు...