కెఎల్ రాహుల్ ఉండగా ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ? ప్రయోగాలతో టీమ్‌ని నాశనం చేస్తున్న రాహుల్ ద్రావిడ్...

First Published Dec 8, 2022, 12:28 PM IST

రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అయితే ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా స్వదేశంలో ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టినా విదేశాల్లో మాత్రం విఫలమవుతూ వస్తోంది. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో వన్డే సిరీస్ కోల్పోయింది...

team india

సౌతాఫ్రికా పర్యటనలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయిన టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2022 మొదలెట్టిన భారత జట్టు... సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది.

తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి వన్డే సిరీస్ కోల్పోయింది. తొలి వన్డేలో టీమిండియా పరాజయానికి పేలవ బ్యాటింగ్, ఫీల్డింగ్ కారణమైతే రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాల వల్లే ఓడింది. రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపింది టీమిండియా...

శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావడం ఇది ఆరోసారి. ఇంతకుముందు 2008లో నాలుగుసార్లు, 2014లో ఓ మ్యాచ్‌లో మాత్రమే ఓపెనింగ్ వచ్చి, మొదటి బంతిని ఫేస్ చేశాడు విరాట్ కోహ్లీ...

టీ20ల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే వన్డేల్లో మాత్రం విరాట్ ఓపెనర్‌గా సక్సెస్ కాలేదు. రెండో వన్డేలోనూ అదే సీన్ రిపీట్ అయ్యాడు. 5 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.

kl rahul

రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా కెఎల్ రాహుల్ రూపంలో టీమిండియాలో మరో ఓపెనర్‌ అందుబాటులో ఉన్నాడు. రాహుల్ ఉండగా విరాట్ కోహ్లీని ఓపెనింగ్ పంపించాల్సిన అవసరం ఏముంది?  టీమిండియా ప్రయోగాలు అక్కడితో ఆగలేదు...

వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ వస్తే, నాలుగో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ని పంపించింది భారత జట్టు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సుందర్ ఆడిన ఇన్నింగ్స్‌ల కారణంగా అతన్ని టాపార్డర్‌కి ప్రమోట్ చేసింది. ఈ ప్రయోగం కూడా పెద్దగా వర్కువట్ కాలేదు. సుందర్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

తొలి వన్డేలో కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో వచ్చి 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని ఆ ప్లేస్‌కి ఫిక్స్ చేయాలని భావించిన రాహుల్ ద్రావిడ్... టాపార్డర్‌లో రోహిత్ మిస్ అయిన కారణంగా వాషింగ్టన్ సుందర్‌ని ప్రమోట్ చేసింది...

గత ఏడాది కాలంలో టీమిండియా ఓపెనర్ల దగ్గర్నుంచి బ్యాటింగ్ ఆర్డర్ దాకా ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... టీమ్‌ని కుదురుకోవడానికి సమయం కూడా లేకుండా చేస్తున్నాడని అంటున్నారు అభిమానులు. ఇప్పటికైనా అనవసర ప్రయోగాలు మానుకొని ఓ ప్లేయింగ్ ఎలెవన్‌ని, బ్యాటింగ్ ఆర్డర్‌ని ఆడిస్తే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

click me!