టీమ్ కోసం కాదు! దేశం కోసం ఆడడానికి వచ్చా... రెండో వన్డే తర్వాత రోహిత్ శర్మ ఎమోషనల్ ట్వీట్...

First Published Dec 8, 2022, 12:06 PM IST

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఆట ప్రారంభమైన తర్వాత రెండో ఓవర్‌లోనే గాయపడి ఫీల్డ్ వదిలాడు రోహిత్ శర్మ. బంగ్లా ఓపెనర్ అనమోల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ, చేతికి గాయం చేసుకున్నాడు. వెంటనే ఫీల్డ్ వదిలి, దాదాపు మ్యాచ్ ముగుస్తుందని బ్యాటింగ్‌కి వచ్చాడు...

Rohit Sharma

చేతుల్లో వాలుతున్న బంతిని అందుకోవడంలో చాలా లేటుగా రియాక్ట్ అయ్యాడు రోహిత్ శర్మ. క్షణ కాలం ఆలస్యం కావడంతో క్యాచ్ డ్రాప్ చేయడమే కాకుండా చేతిని బలంగా నేలకు తాకించుకున్నాడు. రోహిత్ శర్మ చేతి నుంచి రక్తం కారడంతో ఆసుపత్రికి పంపించారు వైద్యులు...

Rohit Sharma

ఇటు మ్యాచ్ సాగుతున్న సమయంలో రోహిత్ శర్మ బొటనవేలికి స్కానింగ్ నిర్వహించారు వైద్యులు. స్కానింగ్‌లో చేతి ఎముకకి ఏమీ కాలేదని తేలడంతో గాయానికి కట్టుతోనే బ్యాటింగ్‌కి వచ్చాడు రోహిత్ శర్మ... 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి పట్టువదలని పోరాటం ప్రదర్శించాడు...

Rohit Sharma

రోహిత్ శర్మ పోరాటం వల్ల టీమిండియా ఆఖరి బంతి వరకూ పోరాడి ఓడింది. చివరి 2 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా ఐదో బంతికి సిక్సర్ బాదిన రోహిత్, చివరి బంతిని బౌండరీ బయట పడేయలేకపోయాడు. దీంతో బంగ్లాకి 5 పరుగుల తేడాతో విజయం దక్కింది.

Rohit Sharma

గాయంతో బాధపడుతూ క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, బ్యాటింగ్ చేసే సమయంలో కూడా నొప్పితో విలవిలలాడాడు. మ్యాచ్ అనంతరం ‘నేను నా టీమ్‌ కోసం ఆడలేదు, నా దేశం కోసం ఆడడానికి వెళ్లాను..’ అంటూ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై ఆయన భార్య రితికా శర్మ కూడా స్పందించింది. ‘ఐ లవ్ యూ.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. అంత గాయం తర్వాత ఇలా వెళ్లి ఆడావు చూడు.. అదే నువ్వు...’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేసింది రితికా శర్మ.. 

గాయం కారణంగా రోహిత్ శర్మ, రెండో వన్డే ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకోబోతున్నాడు. మూడో వన్డేలో రోహిత్ శర్మ ఆడడం లేదని రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. టెస్టు సిరీస్ సమయానికైనా రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడా? అనేది అనుమానంగా మారింది.

click me!