మహ్మద్ సిరాజ్ మెయిడిన్ ఆడడం వల్లే టీమిండియా ఓడిందా... రోహిత్‌కి స్ట్రైయిక్ దొరికి ఉంటే...

Published : Dec 08, 2022, 11:01 AM ISTUpdated : Dec 08, 2022, 11:03 AM IST

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో వన్డేలోనూ ఓడి సిరీస్‌ని కోల్పోయింది. తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక ఓడిన భారత జట్టు, రెండో వన్డేలో 272 పరుగుల లక్ష్యఛేదనలో దగ్గరిదాకా వచ్చి 5 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈసారి సిరాజ్‌పై ట్రోలింగ్ రావడం విశేషం...

PREV
17
మహ్మద్ సిరాజ్ మెయిడిన్ ఆడడం వల్లే టీమిండియా ఓడిందా... రోహిత్‌కి స్ట్రైయిక్ దొరికి ఉంటే...
KL Rahul

తొలి వన్డేలో టీమిండియా ఓటమికి చెత్త ఫీల్డింగ్ కూడా ఓ కారణం. బ్యాటుతో రాణించి 72 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మెహిదీ హసన్ ఇచ్చిన ఈ క్యాచ్‌ని జారవిడిచి ట్రోలింగ్ ఫేస్ చేశాడు. ఆ తర్వాతి బంతికి వాషింగ్టన్ సుందర్ కూడా క్యాచ్ అందుకోలేకపోయాడు...

27
Rohit Sharma

రెండో వన్డేలో టీమిండియా టాపార్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. అయితే గాయం కారణంగా ఓపెనింగ్‌కి రాని ఏడో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి వచ్చే సమయానికి టీమిండియా విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 64 పరుగులు కావాలి...

37
Rohit Sharma

ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, 49వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. దీపక్ చాహార్ అవుటైన తర్వాత మహ్మద్ సిరాజ్‌తో కలిసి 9వ వికెట్‌కి 39 పరుగులు జోడించాడు రోహిత్ శర్మ...

47

అయితే ముస్తాఫిజుర్ రహీమ్ వేసిన 48వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్... ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఇన్‌స్వింగర్లతో సిరాజ్‌ని తెగ ఇబ్బందిపెట్టాడు ముస్తాఫిజుర్. దీంతో సిరాజ్ ఈ ఓవర్‌లో రోహిత్‌కి రెండు బంతులు ఆడే అవకాశం ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేదని అంటున్నారు నెటిజన్లు...

57
Image credit: PTI

అయితే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ అంతసేపు క్రీజులో ఉండడమే చాలా గొప్ప విషయం. మహ్మద్ సిరాజ్ అనవసర షాట్‌కి ప్రయత్నించి అవుటై ఉంటే మ్యాచ్ ఇంత దూరం వచ్చేది కూడా కాదు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌కి ఉన్న అనుభవం మూడు వన్డేలే. కాబట్టి అతన్ని అవుట్ చేయడం బంగ్లాకి పెద్ద కష్టం అయ్యేది కాదు...

67
Image credit: Getty

అదీకాకుండా ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రోహిత్ శర్మ లాంటి భారత స్టార్ బ్యాటర్, వరల్డ్ క్లాస్ హిట్టర్ కూడా మూడు డాట్ బాల్స్ ఆడాడు. అలాంటప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయని బౌలర్‌... ఆరు డాట్ బాల్స్ ఆడడం పెద్ద తప్పేమీ కాదు...

77

గాయమైన తర్వాత కూడా రోహిత్ శర్మ పోరాడిన తీరు అసాధారణం. అందుకు అతన్ని మెచ్చుకుని తీరాల్సిందే. కెఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ కూడా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రెండు మెయిడిన్ ఓవర్లు ఆడాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో కూడా తొలి ఓవర్‌లో ఒక్క సింగిల్ తీయలేకపోయాడు రాహుల్. కాబట్టి బౌలర్ నుంచి ఇలాంటివి సహజం...

click me!

Recommended Stories