అక్కడ ఎలా గెలవాలో చేసి విరాట్ చూపించాడు, కెఎల్ రాహుల్ ఎలా ఓడాలో చూపిస్తున్నాడు...

First Published Jan 22, 2022, 9:58 AM IST

సౌతాఫ్రికా టూర్‌లో సారథిగా కొత్త అవతారం ఎత్తాడు కెఎల్ రాహుల్. టెస్టు సారథిగా, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్, ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు...

గత 60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మొదటి మూడు మ్యాచుల్లో ఓడిన ఏకైక కెప్టెన్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు కెఎల్ రాహుల్...

సౌతాఫ్రికాలో ఇప్పటిదాకా ఆరు సార్లు వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మాత్రమే సిరీస్ నెగ్గగలిగింది...

అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ ఓడిన టీమిండియా, ధోనీ కెప్టెన్సీలో రెండుసార్లు సిరీస్ విజయాన్ని దక్కించుకోలేకపోయింది...

అయితే గత పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో గెలిచి, సఫారీ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది టీమిండియా...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంటే, మిగిలిన భారత కెప్టెన్లు అందరూ కలిసి 30 మ్యాచుల్లో 5 విజయాలు మాత్రమే అందించగలిగారు...

2018 సౌతాఫ్రికా పర్యటనలో ఆరు వన్డేల్లో ఏకంగా 558 పరుగులు చేసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 

వన్డే సారథిగా విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. 71 శాతం విజయాలు అందుకున్న విరాట్, 20 సిరీసుల్లో 17 సార్లు విజయాలు అందుకున్నాడు..

సౌతాఫ్రికాని సౌతాఫ్రికాలో, న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లో, ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాను ఓడించి వన్డే సిరీస్ గెలిచిన ఏకైక ఆసియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే...

2018లో సౌతాఫ్రికాలో పర్యటించిన జట్టుకీ, ఇప్పటి జట్టుకీ పెద్ద తేడాలేవీ లేవు. కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ, అజింకా రహానే, ఎమ్మెస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ ఇప్పటి టీమ్‌లో ఉన్నారు...

రోహిత్ శర్మ, అజింకా రహానే, ఎమ్మెస్ ధోనీ ఉన్నా గత సౌతాఫ్రికా పర్యటనలో ఈ ముగ్గురూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిందేమీ లేదు... రోహిత్ శర్మ 170, రహానే 140, ధోనీ 69 పరుగులు మాత్రమే చేశారు...

అప్పటి సౌతాఫ్రికా టీమ్‌లో ఏబీ డివిల్లియర్స్, డుప్లిసిస్, మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్ వంటి లెజెండరీ స్టార్లు ఉన్నారు. అయినా సఫారీలను చిత్తు చేసింది టీమిండియా...

మారిందల్లా భారత జట్టు ఆటతీరే. పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా జట్టును ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. వారిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు అపసోపాలు పడుతున్నారు...

విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తే, కెఎల్ రాహుల్ కెప్టెన్సీ భారాన్ని మోయలేక తెగ ఇబ్బంది పడుతున్నాడు... అంతే తేడా! మిగిలినదంతా సేమ్ సేమ్... అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!