వెంకటేశ్ అయ్యర్ దగ్గర ఆ సత్తా లేదా, మనోళ్లకి వాడడం తెలియడం లేదా... హార్ధిక్ పాండ్యా అవుతాడనుకుంటే...

First Published Jan 21, 2022, 7:31 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ఓ మెరుపులా టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో కేకేఆర్ కథను మార్చిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్, టీమిండియాలో వచ్చిన అవకాశాలను మాత్రం సరిగా వినియోగించుకోలేకపోతున్నాడు...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నుంచి టీమిండియాలోకి వచ్చిన హార్ధిక్ పాండ్యాను అప్పటి కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అద్భుతంగా వాడుకున్నాడు...

తన కెరీర్‌లో వేసిన మొదటి స్పెల్‌లో భారీగా పరుగులు సమర్పించాడు హార్ధిక్ పాండ్యా. అయితే అతనితో మాట్లాడి, ఆత్మవిశ్వాసం నింపి, ఒత్తిడిని తగ్గించి రిజల్ట్ రాబట్టగలిగాడు ఎమ్మెస్ ధోనీ...

ఆ తర్వాత హార్ధిక్ పాండ్యాకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వెన్ను గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతుండడంతో ఆ ప్లేస్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం దక్కింది...

దేశవాళీ టోర్నీల్లో వెంటకేశ్ అయ్యర్‌కి అద్భుతమైన రికార్డు ఉంది. విజయ్ హాజారే ట్రోఫీ 2021లో 6 మ్యాచుల్లో 2 సెంచరీలతో 379 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, 9 వికెట్లు కూడా తీయగలిగాడు...

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో కేకేఆర్‌కి ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, జట్టు ఆటతీరునే మార్చేసి... ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తాని ఫైనల్‌కి తీసుకురాగలిగాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌ సెకండాఫ్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్, యాటిట్యూడ్ వేరే లెవల్‌లో కనిపించింది. ఎంతో అంతర్జాతీయ అనుభవం ఉన్న స్టార్ ప్లేయర్‌తో పూర్తి కాన్ఫిడెన్స్‌తో పరుగులు చేశాడు అయ్యర్...

అయితే అంతటి అద్భుతమైన ప్రతిభ ఉన్న వెంకటేశ్ అయ్యర్, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు...

రోహిత్ శర్మ కెప్టెన్సీలో 3 టీ20 మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్‌కి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం కానీ, బౌలింగ్ చేసే సదుపాయం కానీ దొరకలేదు...

అలాగే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మొదటి వన్డేలో అయ్యర్‌కి బౌలింగ్‌యే ఇవ్వలేదు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినా, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఎలా ఆడాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంటర్నేషనల్ స్టార్ బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన వెంకటేశ్ అయ్యర్, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం డిఫెన్స్ ఆడాలా? షాట్స్ ఆడాలా? తెలియక తెగ తికమకపడుతున్నాడు...

వెంకటేశ్ అయ్యర్‌లో టాలెంట్ పుష్కలంగా ఉంది. ఐపీఎల్‌లో కానీ, దేశవాళీ టోర్నీల్లో కానీ అతని పర్ఫామెన్స్ చూస్తే ఆ విషయం క్లియర్‌గా తెలుస్తోంది...

అయితే వెంకటేశ్ అయ్యర్‌ని ఎలా వాడాలో కేకేఆర్‌లో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌‌కి తెలిసినట్టుగా కొత్త కెప్టెన్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లకి తెలియడం లేదు..

వెంకటేశ్ అయ్యర్‌ సత్తా చాటితే సీనియర్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి జట్టులో చోటు కరువవుతుందనే ఉద్దేశంతో అతన్ని సరిగ్గా వాడడం లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

click me!