రాహులా, నీ కెప్టెన్సీకో దండం... నిన్ను కెప్టెన్‌గా చేస్తే, టీమిండియా పని గోవిందే...

First Published Jan 21, 2022, 9:31 PM IST

సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్సీ మార్పు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ముందు కెప్టెన్‌గా అనుకున్న రోహిత్ శర్మ గాయపడడం, పాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేస్‌లో కెఎల్ రాహుల్ పగ్గాలు తీసుకోవడం జరిగిపోయాయి...

కెప్టెన్ ఎవరైతే ఏంటి, సిరీస్ గెలిస్తే చాలు అనుకున్నారంతా... భావి కెప్టెన్‌గా భావిస్తున్న కెఎల్ రాహుల్‌కి ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్ అవుతుందనుకున్నారు మరికొందరు...

అయితే ఐపీఎల్‌లోనే కెప్టెన్‌గా అట్టర్‌ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. తాను ఎంత మంచి బ్యాట్స్‌మెన్ అయినా కెప్టెన్సీ స్కిల్స్ ఏ మాత్రం లేవని మరోసారి రుజువు చేశాడు...

జోహన్‌బర్గ్‌లో టీమిండియా ఇప్పటిదాకా ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీ పుణ్యమాని, రెండో టెస్టులో ఆ లోటు తీరిపోయింది. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు...

బీసీసీఐతో విభేదాలతో మానసికంగా కృంగిపోయిన విరాట్ కోహ్లీ, కేప్‌టౌన్ టెస్టులో రీఎంట్రీ ఇచ్చినా... తనలో ఇంతకుముందు ఉండే ఫైర్ అయితే కనిపించలేదు...

విరాట్ కోహ్లీని బీసీసీఐ అవమానిస్తుందనే బాధకంటే, కెఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీ టీమిండియా అభిమానులను మరింత కలవరబెడుతోంది...

మూడు నెలల క్రితం టాప్ టీమ్‌గా ఉన్న భారత జట్టు, ఇప్పుడు బీ గ్రేడ్ టీమ్‌లా పర్ఫామెన్స్ ఇస్తోంది. ముఖ్యంగా భారత జట్టుకి ప్రధాన బలమైన బౌలర్లు తమ రేంజ్‌లో రాణించలేకపోతున్నారు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో అదరగొట్టిన జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ అండ్ కో... వికెట్ల తీయడానికి తెగ కష్టపడుతున్నారు...

ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్... కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా చేస్తే భవిష్యత్తులో టీమిండియా ఆటతీరు ఇలా ఉండబోతుందా? అని భయపడుతున్నారు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరీస్ గెలవలేదనే లోటు మినహా గత పర్యటనలో సౌతాఫ్రికాని వన్డేల్లో, టీ20ల్లో చిత్తు చేసింది భారత జట్టు...

ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో గెలిచిన భారత జట్టు, టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అప్పుడు సత్తా చాటిన బౌలర్లే, ఇప్పుడు వికెట్లు తీయడానికి తెగ కష్టపడుతున్నారు...

అప్పటికీ, ఇప్పటికీ మారింది ఒక్కటే కెప్టెన్సీ. బీసీసీఐ అనవసర రాజకీయాలతో భారత జట్టుకి తీవ్ర నష్టం జరుగుతోందని వాపోతున్నారు అభిమానులు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్స్ గెలవకపోయినా, ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చేది భారత జట్టు. ఇప్పుడు అందులో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతోంది..

క్రీజులో రెడ్ బుల్‌ ఎనర్జీతో కదులుతూ మిగిలిన ప్లేయర్లతో ఆ జోష్ నింపేవాడు విరాట్ కోహ్లీ. కెఎల్ రాహుల్ ముఖంలోనే కెప్టెన్సీ ప్రెషర్ కనిపిస్తోంది... 

వన్డే, టీ20 ఫార్మాట్ సంగతి ఎలా ఉన్నా, టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి ఇస్తారో అనే భయం మొదలైంది. కొంపదీసి టెస్టు పగ్గాలు కెఎల్ రాహుల్‌కి ఇస్తే, టీమిండియా పర్ఫామెన్స్ పడిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు...

click me!