రిషబ్ పంత్‌కేమో అలా చెప్పి, అతన్ని ఎలా ఆడనిచ్చారు... ఇది ఛీటింగ్!...

First Published Sep 3, 2021, 8:17 PM IST

భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆటతీరు కొన్ని అనుమానాలకు తావిస్తోంది. చూడడానికి చాలా ఫెయిర్ ప్లేగా కనిపిస్తున్నా, అందుబాటులో కొన్ని లొసుగులను ఉపయోగించుకుని, ఇంగ్లాండ్ ఛీటింగ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు టీమిండియా అభిమానులు...

మూడో టెస్టులో రెండు పరుగులకే అవుటైన తర్వాత భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, అంపైర్‌పై చేసిన కామెంట్లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి...

బౌలర్లపై ఎదురుదాడికి బ్యాటింగ్ చేయడం రిషబ్ పంత్‌కి అలవాటు. అయితే క్రీజులో లైన్ దాటి ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్‌ను డేంజర్ ఏరియాలోకి అడుగు పెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు అంపైర్...

దీంతో తన బ్యాటింగ్ ఏరియాను మార్చుకున్న రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకోమని అంపైర్ చెప్పడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు...

‘బ్యాట్స్‌మెన్‌కి ఎక్కడైనా నిల్చొని బ్యాటింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. కావాలంటే మిడిల్ క్రీజులో నిలబడి ఆడొచ్చు. అడ్డుచెప్పడానికి అంపైర్‌కి ఎలాంటి అధికారం ఉండదు.. రిషబ్ పంత్ చేసిన కామెంట్లు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన హసీబ్ హమీద్ కూడా ఇలాగే బ్యాటింగ్ చేయడం విరాట్ కోహ్లీ గమనించాడు.. డేంజర్ ఏరియాలోకి వచ్చి బ్యాటింగ్ చేయడంతో పాటు తన బూటుతో క్రీజుని తవ్వేయడం గమనించి, అంపైర్‌కి ఫిర్యాదు చేశాడు...

రిషబ్ పంత్ ఆడినప్పుడు అభ్యంతరం తెలిపారు, మరి హసీబ్ హమీద్‌కి ఎందుకు ఏమీ చెప్పలేదంటూ నిలదీశాడు భారత సారథి విరాట్ కోహ్లీ. అంపైర్ మాత్రం దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు..

హసీబ్ హమీద్ తమ దేశపు ప్లేయర్ కాబట్టి వదిలేశారని, రిషబ్ పంత్ భారత ప్లేయర్ కాబట్టి అంపైర్లు అతని విషయంలో మరోలా వ్యవహారించారని... ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఛీటింగ్ అంటూ ఆరోపిస్తున్నారు టీమిండియా అభిమానులు...

click me!