తెలియనప్పుడు అవుట్ ఎలా ఇస్తారు... థర్డ్ అంపైర్ల నిర్ణయాలపై విరాట్ కోహ్లీ అసహనం...

First Published Mar 19, 2021, 11:42 AM IST

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో థర్డ్ అంపైర్ ప్రకటించిన రెండు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. క్రికెట్ గురించి ఏ మాత్రం అవగాహన లేనివాళ్లు కూడా నాటౌట్‌గా ప్రకటించే నిర్ణయాలను కూడా అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలు ప్రకటించి ఉండకపోయి ఉంటే, భారత జట్టు స్కోరు 200+ దాటి ఉండేదే...
undefined
మొదటి ఇన్నింగ్స్‌లోనే అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు సూర్యకుమార్...
undefined
ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కి ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్‌, డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి మలాన్ చేతిలో పడిన తర్వాత నేలపై తాకినట్టు స్పష్టంగా కనిపించింది...
undefined
అయితే నిర్ణయం ప్రకటించడానికి చాలా సమయం తీసుకుని, పలుమార్లు రిప్లై చూసిన థర్డ్ అంపైర్ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెత్త అంపైరింగ్ అంటూ ట్వీట్ చేశారు...
undefined
బంతి నేలను తాకినా అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు సూర్యకుమార్ యాదవ్. అతను ఇంకొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసేవాడే..
undefined
ఆ తర్వాత మొదటి బంతికే బౌండరీ బాదిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి, అదిల్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో రషీద్ కాలు, బౌండరీ లైన్‌ను తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయినా సుందర్‌ను అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...
undefined
‘క్లారిటీ లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వకపోతేనే బెటర్. అంపైర్ల సాఫ్ట్ సిగ్నల్స్ కారణంగా తప్పిదాలు జరుగుతున్నాయి. టెస్టు సిరీస్‌లో కూడా రహానే అందుకున్న ఓ క్యాచ్ విషయంలో ఇలాగే జరిగింది...
undefined
అంపైర్లు చేసే ఇలాంటి తప్పిదాలు ఆటను దెబ్బతీస్తాయి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అంపైర్ చేసిన చిన్న తప్పుల కారణంగా మ్యాచ్ ఫలితమే మారిపోయి ఉండేది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ...
undefined
లక్ష్యచేధనలో ఇంగ్లాండ్ జట్టు 177 పరుగులకి పరిమితమైంది. 2 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లాండ్ రెండు సిక్సర్లు సాధించి ఉంటే, టీమిండియాకి ఓటమి ఎదురయ్యేది.
undefined
అంపైర్ ప్రకటించిన తప్పుడు నిర్ణయాలకు సిరీస్ ఓటమితో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది... నాలుగు టీ20ల సిరీస్‌లో చెరో రెండు మ్యాచులు గెలిచిన ఇంగ్లాండ్, ఇండియా శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలబడబోతున్నాయి.
undefined
click me!