టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి మహ్మద్ సిరాజ్... నేటి నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్...

First Published Jan 18, 2023, 9:33 AM IST

మూడేళ్ల అజ్ఞాత వాసం తర్వాత విరాట్ కోహ్లీలోని బ్యాట్స్‌మెన్ మళ్లీ బయటికి వచ్చాడు. నాలుగు మ్యాచుల గ్యాప్‌లో మూడు సెంచరీలు చేసి దుమ్మురేపాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డుకు కేవలం 3 సెంచరీల దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...

మూడేళ్ల అజ్ఞాత వాసం తర్వాత విరాట్ కోహ్లీలోని బ్యాట్స్‌మెన్ మళ్లీ బయటికి వచ్చాడు. నాలుగు మ్యాచుల గ్యాప్‌లో మూడు సెంచరీలు చేసి దుమ్మురేపాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డుకు కేవలం 3 సెంచరీల దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...

Image credit: PTI

లంకతో వన్డే సిరీస్‌లో చూపించిన ఫామ్‌ని నేటి నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కొనసాగిస్తే విరాట్ కోహ్లీ వన్డేల్లో సచిన్ టండూల్కర్ రికార్డును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు...

Image credit: PTI

శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసి రెండు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ... ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 4లోకి రీఎంట్రీ ఇచ్చాడు..

Image credit: PTI

2021 ఏడాది ఆరంభంలో వన్డేల్లో టాప్ బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, చాలా మ్యాచులకు దూరంగా ఉండడం, ఆడిన మ్యాచుల్లో పేలవ ప్రదర్శన ఇవ్వడంతో ర్యాంకింగ్స్‌లో దిగజారాడు. 2022 ఏడాది చివర్లో టాప్ 10లో కూడా చోటు కోల్పోయాడు...
 

Image credit: PTI

బంగ్లాదేశ్‌పై ఆఖరి వన్డేలో సెంచరీ చేసి టాప్ 8లోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, లంకతో మొదటి వన్డేలో సెంచరీతో టాప్ 6లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మూడో వన్డేలో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, మరో రెండు స్థానాలు ఎగబాకి టాప్ 4కి ఎంట్రీ ఇచ్చాడు...
 

విరాట్ కోహ్లీ మరో 119 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బ్యాటర్‌గా నిలవబోతున్నాడు విరాట్ కోహ్లీ...

Image credit: PTI

మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు.  బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి ముందు టాప్ 10లో కూడా లేని మహ్మద్ సిరాజ్... శ్రీలంకతో తొలి వన్డే తర్వాత టాప్ 8లోకి వచ్చాడు. తాజాగా మూడో వన్డేలో 4 వికెట్లు తీసిన సిరాజ్.. టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చాడు...
 

Team India vs SL Mohammad Siraj Celebration

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టాప్‌లో ఉంటే, ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్ టాప్ 2లో ఉన్నాడు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌లో ట్రెంట్ బౌల్ట్ ఫెయిల్ అయినా, సిరాజ్ అదరగొట్టినా టాప్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

click me!