సూర్యని ఆ ప్లేస్‌లో ఆడించడానికే శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేశారా... వన్డేల్లో తేలిపోతున్న...

First Published Jan 17, 2023, 6:13 PM IST

సూర్యకుమార్ యాదవ్, నెం.1 టీ20 బ్యాటర్. అయితే వన్డేల్లో మాత్రం సూర్యకి అంత సీన్ లేదు. ఎందుకంటే గత ఏడాదిలో టీ20ల్లో 1100+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయాడు. దీంతో వన్డేల్లో సూర్య, తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదానికి చేరుకున్నాడు...

Suryakumar Yadav

ఆఖరి 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 86.3 యావరేజ్‌తో 518 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 14.1 సగటుతో 127 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్డేల్లో మాత్రం సూర్య... ఆశించిన స్థాయిలో రాణించడం లేదు...

Image credit: Getty

ఈ కారణంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని మొదటి రెండు మ్యాచులకు దూరం పెట్టింది టీమిండియా. మూడో టీ20లో సెంచరీ చేసిన తర్వాత సూర్య, రెండు మ్యాచులకు దూరం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది...
 

Image credit: PTI

మూడో వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కినా ఆఖర్లో 2 ఓవర్లు మిగిలి ఉండగా బ్యాటింగ్‌కి వచ్చాడు. 4 పరుగులు చేసి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. దీంతో సూర్యకి వన్డేల్లో నాలుగో స్థానంలో మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తోందట బీసీసీఐ...

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి కొన్ని గంటల ముందు శ్రేయాస్ అయ్యర్ గాయంతో తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌‌ని నాలుగో స్థానంలో రెగ్యూలర్‌గా ఆడించడానికే శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేయలేదు కదా.. అని అనుమానిస్తున్నారు అభిమానులు...

Image credit: PTI

సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కుదురుకుంటే, అయ్యర్ కంటే భీకరమైన బ్యాటర్... శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిలబెట్టుకుంటూ స్కోరు బోర్డును నడిపించే బ్యాటర్ అయితే సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో బౌలర్లను ఉక్కిరి బిక్కిరి చేయగల బ్యాట్స్‌మెన్. ..

Image credit: PTI

అందుకే వన్డే వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్ కంటే సూర్యకుమార్ యాదవ్‌ని ఆడిస్తేనే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందని, అందుకే గాయం వంకతో అయ్యర్‌ని సైడ్ చేస్తారని పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.

Shreyas Iyer and Suryakumar Yadav

ఒకవేళ సూర్య వన్డేల్లో కూడా నాలుగో స్థానంలో సెటిల్ అయితే, శ్రేయాస్ అయ్యర్ ఈ ఫార్మాట్‌లో కూడా తుది జట్టులోకి రావడం కష్టమైపోతుంది... ఇప్పటికే సూర్య రాకతో టీ20ల్లో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో కూడా వెనకబడ్డాడు.. 

click me!