ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే ఆ రికార్డు బ్రేక్ చేసి పక్కనబెడతాడు... భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

First Published Jan 17, 2023, 7:09 PM IST

టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఒకటి రెండు మ్యాచులను పక్కనబెడితే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో ఇరగదీసింది. ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఉమేశ్ యాదవ్‌ వంటి సీనియర్లతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శివమ్ మావి, నవ్‌దీప్ సైనీ, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రబౌలర్లు కూడా అదరగొడుతున్నారు..

ఉమ్రాన్ మాలిక్, టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి టాప్ పర్ఫామర్‌గా మారితే వన్డేల్లో ఆ స్థానం మహ్మద్ సిరాజ్‌ది. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఆరు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్నా భారత జట్టు ద్వైపాక్షిక సిరీసుల్లో మంచి విజయాలు అందుకుంటుందంటే దానికి ఈ ఇద్దరూ కూడా కారణం...

ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలోకి వచ్చిన ‘స్పీడ్ గన్’ ఉమ్రాన్ మాలిక్, ఆడిన కొద్ది మ్యాచుల్లో రికార్డు పర్ఫామెన్స్ ఇచ్చాడు. టీ20ల్లో 155+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన ఉమ్రాన్ మాలిక్, లంకతో వన్డే సిరీస్‌లో 157+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరాడు...

Umran Malik

టీమిండియా తరుపున వన్డేల్లో, టీ20ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ బౌలింగ్ చేసిన బౌలర్‌గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్, కొన్ని రోజుల్లో క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును బ్రేక్ చేయబోతున్నాడని అంటున్నాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

Umran Malik

‘ఉమ్రాన్ మాలిక్, టీమిండియాకి దొరికిన అరుదైన వజ్రంలాంటోడు. 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ ఏ జట్టుకైనా వరమే. అతని టాలెంట్, టీమిండియాకి ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అతను స్టార్ బౌలర్‌గా మారతాడు...

Umran Malik-Shoaib Akhtar

ఫాస్ట్ బౌలింగ్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్, స్కిల్స్ సగం సగం కలిసి ఉంటాయి. కాబట్టి ఉమ్రాన్ మాలిక్ సుదీర్ఘ కెరీర్ కొనసాగించాలంటే ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం చాలా అవసరం. నా ఉద్దేశంలో త్వరలోనే ఉమ్రాన్ మాలిక్, షోయబ్ అక్తర్ రికార్డును చెరిపేస్తాడు...

125 స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడు 150 వేయాలంటే కష్టం, అసాధ్యం కూడా. 150 వేసేవాడు, ఈజీగా 155 వేయగలడు. 155 వేసేవాడు, తేలిగ్గా 160 అందుకోగలడు... కాబట్టి అక్తర్ 161 రికార్డును ఉమ్రాన్ మాలిక్ అందుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్..

click me!