కోహ్లీకి డిప్రెషన్ లేదు! తను చెప్పింది వేరు, అర్థం చేసుకుంది వేరు!... విరాట్ మేనేజర్ బంటీ సాజ్దే...

Published : Aug 19, 2022, 01:40 PM IST

విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్ గురించి చేసిన వ్యాఖ్యలు, క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. గది నుంచి తనను ప్రేమించిన వాళ్లు, సపోర్టర్లు ఉన్నా తాను ఒంటరిగా ఫీల్ అయ్యానని మెంటల్ హెల్త్ ప్రాధాన్యం గురించి వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు నెటిజన్లు, అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడంటూ పోస్టులు చేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు...

PREV
15
కోహ్లీకి డిప్రెషన్ లేదు! తను చెప్పింది వేరు, అర్థం చేసుకుంది వేరు!... విరాట్ మేనేజర్ బంటీ సాజ్దే...
Virat Kohli

రెండున్నరేళ్ల క్రితం వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 1000 రోజులుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. బీసీసీఐతో విభేదాల కారణంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది చాలా మ్యాచులకు దూరంగా ఉన్నాడు...

25
Virat Kohli

‘విరాట్ కోహ్లీకి డిప్రెషన్ లెవెల్ ఏంటో బాగా తెలుసు. అతను తను ఫేస్ చేసిన మెంటల్ ఛాలెంజెస్ గురించి ఓపెన్‌గా చెప్పాడు. అతని కెరీర్‌ ఓ దశకు చేరుకున్న తర్వాత మెంటల్ ఛాలెంజ్‌లు ఫేస్ చేశాడు...

35

విరాట్ ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. అతను ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వాళ్లతో కలిసి పోయి, సరదాగా ఉంటాడు. అతని చుట్టూ ఎప్పుడూ చాలా మంది సపోర్టర్లు, ప్రేమించేవాళ్లు ఉంటారు...

45

విరాట్‌కి ఎలాంటి సమస్య లేదు. ఎన్నో అంచనాలను, అంతకుమించి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ టాప్ క్లాస్ క్రికెటర్‌గా ఎదిగాడు.. అతని మెంటల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్...

55
Virat Kohli

డిప్రెషన్ చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు దాన్ని అందరూ తరుచుగా వాడుతున్నారు. విరాట్ కోహ్లీ డిప్రెషన్‌తో బాధపడడం లేదు... అతను మెంటల్లీ చాలా స్ట్రాంగ్...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ మేనేజర్ బంటీ సాజ్దే... 
 

Read more Photos on
click me!

Recommended Stories