మోకాలికి 26 ఇంజెక్షన్లు! ఆ కెప్టెన్ మాత్రం బౌలింగ్ వేయాల్సిందేనంటూ... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

Published : Aug 19, 2022, 12:25 PM IST

క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన క్రికెటర్ షోయబ్ అక్తర్. ప్రపంచంలో మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షోయబ్ అక్తర్, గాయాల కారణంగా సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు. 2003 వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా బయటపెట్టాడు షోయబ్ అక్తర్...

PREV
18
మోకాలికి 26 ఇంజెక్షన్లు! ఆ కెప్టెన్ మాత్రం బౌలింగ్ వేయాల్సిందేనంటూ... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

273 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన టీమిండియాని సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేసి ఆదుకున్నారు. సచిన్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్‌పై అద్భుత విజయం అందుకుంది...

28
Shoaib Akhtar

ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు. తాజాగా ఈ మ్యాచ్‌కి ముందు జరిగిన సంఘటన గురించి బయటపెట్టాడు షోయబ్ అక్తర్...

38

‘ఆ మ్యాచ్‌కి ముందు నేను రెండు రోజులు హాస్పటల్ బెడ్ మీద ఉన్నా. నా మోకాలికి 25-26 ఇంజెక్షన్లు వేశారు. డిశార్జి అయిన వెంటనే బౌలింగ్ చేయడం నా వల్ల కాదని, చాలా నొప్పి ఉందని కెప్టెన్‌కి చెప్పా...

48

అయితే ఆ మ్యాచ్ కెప్టెన్ వకార్ యూనిస్ మాత్రం నువ్వు ఉండాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను బ్యాటర్ల తలను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయమని చెప్పేవాడు...

58
Shoaib Akhtar

ఏ బ్యాటర్ అయినా సిక్సర్ కొడితే మరింత వేగంగా బౌలింగ్ చేయమని చెప్పేవాడు. మనకి వికెట్ కావాలి, నువ్వు మరింత వేగంగా బౌలింగ్ చేయి... వికెట్ అదే వస్తుందని చెప్పి నాలో భరోసా నింపేవాడు...

68

ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆరుకి ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా బౌలింగ్ వేయించేవాడు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో వికెట్ కావాలి. ఒక్క మిస్ హిట్ వస్తే చాలు, వికెట్ పడుతుందని అనుకునేవాడు... 

78

అయితే వకార్ యూనిస్ మాత్రం అలా కాదు. నా బౌలింగ్‌లో ఎవ్వరైనా ఒక్క సిక్సర్ కొడితే చాలు, నన్ను బౌలింగ్ నుంచి తప్పించేవాడు. ఆ మ్యాచ్‌లో కూడా అలాగే అయ్యింది. నేను ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను అవుట్ చేసి ఉంటే సగం మ్యాచ్ గెలిచేసి ఉండేవాళ్లం...

88

నేను ఫాస్ట్ బౌలర్‌ని, వికెట్లు తీయడానికే బౌలింగ్ చేస్తాను. అలా వేసినప్పుడు పరుగులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్. 2003 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించిన షోయబ్ అక్తర్, సెంచరీ చేరువవుతున్న సచిన్ టెండూల్కర్ (98)ని అవుట్ చేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories