విరాట్ కోహ్లీ ఆఖరి సెంచరీకి రెండేళ్లు... అప్పుడు సరదా కోసం సెంచరీలు చేసిన రన్‌ మెషిన్‌కి ఏమైంది...

Published : Nov 23, 2021, 01:45 PM ISTUpdated : Nov 23, 2021, 01:56 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఎందరో స్టార్ క్రికెటర్లను చూసింది, కానీ అందరిలోనూ విరాట్ కోహ్లీ కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ అయినా ఇంత నిలకడగా పరుగులు చేయొచ్చా? అని క్రికెట్ వరల్డ్ ఆశ్చర్యపోయేలా సాగింది రెండేళ్ల క్రితం వరకూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్...

PREV
112
విరాట్ కోహ్లీ ఆఖరి సెంచరీకి రెండేళ్లు... అప్పుడు సరదా కోసం సెంచరీలు చేసిన రన్‌ మెషిన్‌కి ఏమైంది...

దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ‘ఐసీసీ దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు కూడా అందుకున్నాడు...

212

చివరిగా 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. పింక్ బాల్ టెస్టులో సెంచరీ మార్కు అందుకున్న మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు..

312

మయాంక్ అగర్వాల్ 14, రోహిత్ శర్మ 21 పరుగులు చేసి అవుట్ కావడంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

412

194 బంతుల్లో 18 ఫోర్లతో 136 పరుగులు చేసి, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70వ సెంచరీ మార్కు అందుకున్నాడు కోహ్లీ. విరాట్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్లు చప్పట్లతో అభినందించడం, ఓ బంగ్లా క్రికెటర్ అయితే భారత కెప్టెన్‌కి సెల్యూట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...

512

సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ కూడా  అభిమానులుగా మారిపోయి, ఆయన బ్యాటింగ్‌ని వీక్షించేవారో... విరాట్ కోహ్లీ బ్యాటింగ్, అప్పటిదాకా అలా సాగింది...

612

విరాట్ కోహ్లీ రాకముందు 43 పరుగులు చేస్తే, అతను ఆరో వికెట్‌గా అవుటైన తర్వాత మరో 23 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 347 పరుగులు చేస్తే, అందులో విరాట్ ఒక్కడి పరుగులు శాతం 41...

712

ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ చేసిన తర్వాత మళ్లీ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు విరాట్. కరోనా కారణంగా 2020 సీజన్‌లో పెద్దగా క్రికెట్ జరగకపోవడం, తండ్రి కావడంతో ఆస్ట్రేలియా టూర్‌ ఒకే టెస్టు ఆడడంతో 71వ శతకాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు విరాట్...

812

70వ సెంచరీ తర్వాత మొత్తంగా టీ20, వన్డే, టెస్టుల్లో కలిపి 50 మ్యాచుల్లో 56 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ, 40.59 సగటుతో 1989 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

912

బంగ్లాదేశ్‌పై చేసిన ఆఖరి సెంచరీ, విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో 27వ సెంచరీ. అప్పటికి విరాట్ ఖాతాలో 22 హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. హాఫ్ సెంచరీల కంటే సెంచరీలు ఎక్కువగా చేసిన అరుదైన ప్లేయర్లలో ఒకడిగా విరాట్ కోహ్లీ పేరు ఉండేది...

1012

అయితే రెండేళ్లుగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలను సెంచరీగా మలచలేకపోతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీలు, హాఫ్ సెంచరీలు సమానం (27)...

1112

విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా కనిపించని ఆ సెంచరీ సెలబ్రేషన్స్‌ని చూడాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే మళ్లీ ఒక్కసారి సెంచరీ మార్కు అందుకుంటే, రన్ మెషిన్ బ్రేకులు లేని బండిగా దూసుకుపోతుందని వారి అభిలాష...

1212

కాన్పూర్‌లో జరిగే తొలి టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, ఇప్పటికే ముంబైలో జరిగే రెండో టెస్టు కోసం ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories