టెస్టుల్లోకి సూర్యకుమార్ యాదవ్... ఆ ప్లేయర్‌కి రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి చేరే అవకాశం...

First Published Nov 23, 2021, 12:42 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ పరాజయం నుంచి వేగంగానే కోలుకుంది భారత జట్టు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, ఇప్పుడు టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పుడు మొదటి టెస్టు కోసం కాన్పూర్ చేరుకున్నాయి ఇరు జట్లు...

టీ20 సిరీస్‌ ఆడి, టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లతో పాటు కివీస్ టీమ్ కూడా కోల్‌కత్తా నుంచి కాన్పూర్ చేరుకుని, ప్రాక్టీస్ మొదలెట్టేశారు...

బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ టెస్టు టీమ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా భారత జట్టుతో కలిసి మొదటి టెస్టు జరిగే కాన్పూర్ వెళ్లినట్టు సమాచారం...

ఇంగ్లాండ్‌ టూర్‌ మధ్యలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషాలకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే శ్రీలంక టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా... కొలంబో నుంచి నేరుగా లండన్ చేరుకున్నారు...

క్వారంటైన్ ముగించుకుని టీమిండియాకి అందుబాటులోకి వచ్చే సమయానికి నాలుగో టెస్టు కూడా ప్రారంభమైంది. అన్ని సరిగ్గా జరిగి ఉంటే, మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టులో ఈ ఇద్దరూ ఆడతారని టాక్ వినిపించింది...

అయితే భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా ఐదో టెస్టును రద్దు చేసుకుని, ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం యూఏఈకి వెళ్లిపోయింది టీమిండియా...

2021లో వన్డే, టీ20 ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటిదాకా 11 టీ20 మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 244 పరుగులు చేశాడు. 3 వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీతో 124 పరుగులు చేశాడు...

సూర్యకుమార్ యాదవ్‌కి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 77 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5326 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్...

సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ బ్యాటింగ్‌కి ఇంప్రెస్ అయిన సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్... కివీస్ సిరీస్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు...

రెండు టెస్టుల్లో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సూర్యకుమార్ ఎంట్రీ ఇస్తాడు. న్యూజిలాండ్‌తో కాకపోయినా దక్షిణాఫ్రికా టూర్‌లో అయినా యాదవ్‌ని ఆడించాలని భావిస్తున్నారట...

అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్ల ఫామ్‌పై విమర్శలు వస్తుండడం, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్లు సరిగా వాడుకోకపోవడంతో మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లను ఆడించాలని భావిస్తోంది టీమిండియా. 

రోహిత్ శర్మకి టెస్టు సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వడంతో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా, శుబ్‌మన్ గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే అవకాశం ఉంది...  

click me!