భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. 2020 నుంచి కనీసం 400 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో లోయెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ విరాట్ కోహ్లీయే. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లోనూ, ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్‌లోనూ తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు కోహ్లీ...
ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతున్నాదాని కంటే, అవుట్ అవుతున్న విధానంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రతీసారీ లెంగ్త్ బాల్స్‌ను ఎదుర్కోవడంతో ఇబ్బంది పడుతూ, ఎడ్జ్‌తో క్యాచులు ఇస్తూ పెవిలియన్ చేరుతున్నాడు విరాట్ కోహ్లీ...
28
మూడో టెస్టులో 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి, జట్టుల కష్టాల్లో ఉన్నప్పుడు 17 బంతుల్లో 7 పరుగులు చేసి... మళ్లీ ఇదే విధంగా జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
38
ఐదో స్టంప్, ఆరో స్టంప్ లైన్‌లో వచ్చే బంతులను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో టెక్నిక్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని పక్కాగా ఉపయోగించుకుని, అవే బంతులతో కోహ్లీని అవుట్ చేస్తున్నారు ఇంగ్లాండ్ బౌలర్లు...
48
‘ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌లోని పరిస్థితుల్లో మీ ఇగోను మీ పాకెట్‌లో పెట్టుకోవాలని చెప్పాడు. అది నూటికి నూరుపాళ్లు నిజం... అయితే ముందుగా ఆ పని కోహ్లీయే చేయాలి...
58
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తే... ఫలితం ఇలాగే ఉంటుంది. ఆ పిచ్‌లు, నీకు అనుగుణంగా ఉండవు. ఇండియాలోలా బ్యాటింగ్ పిచ్‌ల్లా అవి మనకి సహకరించవు...
68
ఇండియాలో పిచ్ అయితే తేలిగ్గా ఓ కాలు వెనక్కి పెట్టి, డ్రైవ్ చేయొచ్చు. కానీ విరాట్ కోహ్లీ ఏం నేర్చుకున్నాడు. వరుసగా విఫలం అవుతున్నా, నెట్ ప్రాక్టీస్‌లో ఏం చేస్తున్నాడు.
78
నెట్స్‌లో ఈ బంతులను ఎదుర్కోవడానికి తగినంత ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కనిపించడం లేదు. ఇప్పటికే 70 సెంచరీలు చేశాను, ఇంకా ప్రాక్టీస్ చేయాలా? అనే నీ ఇగోని పాకెట్‌లో పెట్టుకుని, నీ టెక్నిన్‌ను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టు...
88
మొదటిసారి ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ ఏదైతే తప్పు చేశాడో, ఇప్పుడు కూడా అదే తప్పులు రిపీట్ చేస్తున్నాడు. రెగ్యూలర్ క్రికెట్ ఆడకపోతే ఇలాగే ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మనీందర్ సింగ్.