సిరాజ్ మియ్యా నువ్వు సూపర్... ట్రోల్ చేయాలని చూసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కి...

First Published Aug 26, 2021, 4:47 PM IST

మహ్మద్ సిరాజ్... ఆస్ట్రేలియా టూర్ తర్వాత టెస్టుల్లో టీమిండియాకి కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా, బుమ్రా స్థానంలో సిరాజ్ ఉండి ఉంటే... ఫలితం వేరేగా ఉండేదని క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకుల అంచనా... 

లార్డ్స్‌ టెస్టులో 8 వికెట్లు తీసి అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, తనని ట్రోల్ చేయాలని చూసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే రీతిలో రివర్స్ పంచ్ ఇచ్చాడు.

మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 78 పరుగులకే ఆలౌట్ కావడం, ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం జోడించడంతో ఆతిథ్య జట్టుకి మంచి ఆధిక్యం దక్కింది. 

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు ఇంగ్లాండ్ ఫ్యాన్స్, స్కోరు ఎంతో చెప్పాలంటూ అరుస్తూ హేళన చేయడం మొదలెట్టారు...

దీనికి తన స్టైల్‌లో 1-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్నామంటూ చేతులతో సంకేతాలు చూపించాడు మహ్మద్ సిరాజ్... లార్డ్స్ టెస్టులో గెలిచి, సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్నామనే విషయం మరిచిపోకూడదని ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చాడు సిరాజ్..

లార్డ్స్ టెస్టులో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్‌పై షాంపైన్ మూతలను విసిరిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్, మూడో టెస్టులోనూ పద్ధతి మార్చుకోలేదు. హెడ్డింగ్లేలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌పైకి ఓ ప్లాస్టిక్ బాల్‌ను విసిరారు కొందరు ఇంగ్లాండ్ ఫ్యాన్స్. 

కెఎల్ రాహుల్‌కి చెప్పినట్టుగానే, మహ్మద్ సిరాజ్‌కి కూడా వాటిని తీసి వాళ్లపైకే విసిరి కొట్టాలని సూచించాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే అంపైర్లు కలగ చేసుకుని, ఆ బాల్‌ను ఫీల్డ్ నుంచి తొలగించారు...

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకునే దిశగా సాగుతున్న ఇంగ్లాండ్ జట్టు, దాదాపు మూడో టెస్టుపై పట్టు సాధించినట్టే. ఇప్పుడు టీమిండియా ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణంగా రాణించాల్సిందే...

click me!