నాకు విరాట్ కంటే ధోనీ అంటేనే ఇష్టం... ఎందుకంటే అతని కెప్టెన్సీ అజిత్‌లా...

First Published Aug 26, 2021, 4:02 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే టెస్టుల్లో మాత్రం ధోనీ రికార్డును ఎప్పుడో అధిగమించాడు విరాట్ కోహ్లీ. ఐదేళ్లుగా నెం.1 టెస్టు టీమ్‌గా టీమిండియాను నిలిపాడు విరాట్ కోహ్లీ... ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అంటే చెప్పడం కష్టం...

కొందరు రెండు వరల్డ్‌కప్ టోర్నీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీయే గొప్ప కెప్టెన్ అంటే... మరికొందరు టెస్టుల్లో ఐదేళ్లుగా టీమిండియాను నెం.1 టీమ్‌గా నిలిపిన విరాట్ కోహ్లీయే గ్రేట్ అంటారు... 

అయితే మాజీ భారత క్రికెటర్, కెప్టెన్ అజిత్ వాడేకర్ భార్య రేఖా వాడేకర్ మాత్రం... తనకి విరాట్ కోహ్లీ కంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీయే ఎక్కువగా నచ్చుతుందని కామెంట్ చేశారు..

‘విరాట్ కోహ్లీ కంటే మహేంద్ర సింగ్ ధోనీ నా ఫెవరెట్. ఎందుకంటే ధోనీ కెప్టెన్సీ, అజిత్‌లా ఉంటుంది. ధోనీ కూడా అజిత్‌లాగే చాలా కూల్ మైండ్‌తో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు...’ అంటూ చెప్పుకొచ్చారు రేఖా వాడేకర్...

1971లో ఇంగ్లాండ్ టూర్‌లో మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుని, చరిత్ర క్రియేట్ చేసింది టీమిండియా. ఈ పర్యటనలో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించారు అజిత్ వాడేకర్... ఈ విజయానికి ఆగస్టు 24తో 50 ఏళ్లు నిండాయి...

మొదటి రెండు టెస్టులను డ్రా చేసుకున్న టీమిండియా... ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలిచి మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలుచుకుంది...

ఈ విజయానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రేఖా వాడేకర్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది... ‘అజిత్ ఎప్పుడూ అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లేవాడు, ధోనీ కెప్టెన్సీ కూడా అలాగే అనిపించింది...

కొన్నిసార్లు అతి ఆవేశం కూడా ఆటను దెబ్బతీయొచ్చు. అందుకే విరాట్ కోహ్లీ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. విరాట్ కోహ్లీ తన ఆవేశాన్ని తగ్గించుకోని, ప్రశాంతంగా ఆలోచించడం మొదలెట్టితే... అతను మళ్లీ నిలకడగా పరుగులు చేయగలడు...’ అంటూ చెప్పుకొచ్చారు రేఖా వాడేకర్... 

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది...

click me!