బీసీసీఐ కాదు, విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్లే కారణం... మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే...

First Published Jan 22, 2022, 1:33 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం, ఒక్కసారిగా అతని కెరీర్ గ్రాఫ్‌నే తలకిందులు చేసేసింది. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించబడి, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకునేదాకా వెళ్లింది...

భారత క్రికెట్ బోర్డు, విరాట్ కోహ్లీతో వ్యవహరించిన తీరే, అతను టెస్టు కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడానికి కారణమని విమర్శలు వచ్చాయి...

టెస్టు క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు అందుకుని, 100వ టెస్టుకి, రికార్డు స్థాయిలో కెప్టెన్‌గా 41 విజయాలకు చేరువలో ఉన్న దశలో విరాట్ ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

‘విరాట్ కోహ్లీ ఈ విధంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నన్ను చాలా బాధపెట్టింది. దీనికి ప్రధాన కారణం అతనికి కెప్టెన్‌గా సరైన గుర్తింపు దక్కలేదు...

నేను బీసీసీఐ గురించి మాట్లడడం లేదు, భారత క్రికెట్ బోర్డు కంటే ఎక్కువగా భారత క్రికెట్ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీని తీవ్రంగా విమర్శించారు, అనరాని మాటలన్నీ అన్నారు...

విరాట్ కోహ్లీ ఎంతో క్రికెట్ ఆడాడు, టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని విధంగా పరుగులు సాధించాడు...

విరాట్‌లో ఆ క్వాలిటీ ఉంది. విదేశాల్లో ఎలా విజయాలు సాధించాలో టీమిండియాకి చూపించాడు. అతను 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడని మరిచిపోకూడదు...

70 అంతర్జాతీయ సెంచరీలు చేయడమంటే సాధారణ విషయం కాదు. అయినా కూడా భారత ఫ్యాన్స్ నుంచి అతనికి కావాల్సిన సపోర్ట్ అయితే రాలేదు, కోహ్లీ కెప్టెన్సీని తిట్టారు, విమర్శించారు, ట్రోల్ చేశారు...

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా విరాట్ కోహ్లీ ఓ లెజెండ్. అతని పర్ఫామెన్స్‌ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. 

అతను టీ20 నుంచి వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు కూడా నేను బాధపడలేదు. ప్రతీ ప్లేయర్ జీవితంలో ఇలాంటివి సర్వసాధారణం...

అయితే అలాంటి ప్లేయర్‌పై ఇలాంటి విమర్శలు మాత్రం సరికాదు.. ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిరణ్ మోరే...

click me!