విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులా? వివరణ ఇచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published Jan 22, 2022, 11:49 AM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి, భారత క్రికెట్ బోర్డుకి మధ్య సంబంధాలు సరిగా లేవని కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియాలో పెను దుమారమే రేగింది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ...

ఆ తర్వాత వన్డే ఫార్మాట్ పగ్గాలు కూడా విరాట్ కోహ్లీ నుంచి లాక్కుంటూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. సఫారీ టూర్‌కి రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా ప్రకటించారు...

ఈ సమయంలో టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని విరాట్ కోహ్లీని తాను స్వయంగా కోరానని ప్రకటించాడు విరాట్ కోహ్లీ...

టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్‌లో కూడా రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారని సెలక్టర్లకు సపోర్ట్ తెలిపాడు గంగూలీ..

అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు పెను సంచలనం క్రియేట్ చేశాయి...

‘తనని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని ఎవ్వరూ కోరలేదని, కేవలం గంటన్నర ముందే వన్డే కెప్టెన్సీ నుంచి చెప్పారని’ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఈ వ్యాఖ్యల కారణంగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా కలిసి విరాట్ కోహ్లీపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి...

ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సౌరవ్ గంగూలీ... ‘నో కామెంట్స్... అన్నీ బోర్డు చూసుకుంటుంది...’ అంటూ మాట దాటేశాడు...

కేప్ టౌన్ టెస్టు పరాజయం తర్వాత టెస్టు ఫార్మాట్‌లో కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...

ఈ నిర్ణయం తర్వాత ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో విరాట్ చేసిన కామెంట్లపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని, అందుకే అతనికి షోకాజ్ నోటీసులు పంపాలని భావించిందని వార్తలు వచ్చాయి...

తాజాగా ఈ నోటీసుల వార్తలపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపాలని అనుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు...’ అంటూ తేల్చేశాడు దాదా...

click me!