Published : Jan 22, 2022, 12:28 PM ISTUpdated : Feb 03, 2022, 07:33 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌కి స్టార్ కళ తప్పేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి ఒకానొక కారణమైన ‘యూనివర్సల్ బాస్’, వెస్టిండీస్ వీరబాదుడు వీరుడు క్రిస్ గేల్ ఈసారి ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కోసం మొత్తంగా 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. వీరిలో 896 మంది భారత క్రికెటర్లు కాగా, 318 మంది విదేశీ ప్లేయర్లు...
29
క్రిస్ గేల్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, జో రూట్... ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు...
39
గత 14 సీజన్లలో పాల్గొన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం...
49
‘క్రిస్ గేల్, ఐపీఎల్ 2022 వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు. అంటే గేల్‌ని మనం ఇకపై ఐపీఎల్‌లో చూడలేం. అతనో అద్భుతమైన ప్లేయర్...
59
ఐపీఎల్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి గేల్ కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ అందించిన సేవలకు నిలబడి, చప్పట్లతో అభినందించాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు కామెంటేటర్ హర్షా భోగ్లే..
69
యాషెస్ సిరీస్ 2021-22లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడడం వల్లే టెస్టుల్లో సరిగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారని ట్రోల్స్ వచ్చాయి...
79
దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్... ఐపీఎల్‌కి దూరంగా ఉండబోతున్నారు. జోఫ్రా ఆర్చర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు...
89
అయితే బెయిర్ స్టోతో పాటు టామ్ కుర్రాన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోతున్నారు...
99
ఆఫ్ఘాన్‌తో పాటు నేపాల్, సింగపూర్, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ దేశాలకు చెందిన ఒక్కో క్రికెటర్ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...