రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీయే బెస్ట్ కెప్టెన్... శుబ్‌మన్ గిల్ సెన్సేషనల్ కామెంట్స్...

Published : Nov 19, 2022, 07:11 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ విపరీతంగా చర్చించుకుంటున్న విషయం ఇదే. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. రోహిత్ శర్మ ఐదు సార్లు టైటిల్ గెలిచాడు..  2021 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గ్రూప్ స్టేజీ కూడా దాటలేకపోయిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో సెమీస్ చేరింది...

PREV
16
రోహిత్ శర్మ కాదు, విరాట్ కోహ్లీయే బెస్ట్ కెప్టెన్... శుబ్‌మన్ గిల్ సెన్సేషనల్ కామెంట్స్...

పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్ 19 వరల్డ్ కప్ 2018 గెలిచిన జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు శుబ్‌మన్ గిల్. ఆ టోర్నీలో 372 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, అదే పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు... 

26
Shubhman Gill

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2019లో న్యూజిలాండ్‌లో పర్యటించిన జట్టులో చోటు దక్కించుకున్న శుబ్‌మన్ గిల్, రెండేళ్ల తర్వాత అజింకా రహానే కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. మెల్‌బోర్న్ టెస్టులో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో 91 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు...

36

రోహిత్ శర్మ గాయపడడంతో జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టులో పూజారాతో కలిసి ఓపెనింగ్ చేశాడు శుబ్‌మన్ గిల్.. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు...

46
Image credit: PTI

‘నేను అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయా.  9 పరుగులకే  చేసినందుకు తెగ ఫీల్ అవుతూ కూర్చున్నా. అప్పుడు మాహీ నా దగ్గరికి వచ్చి, బాధపడకు... మొదటి మ్యాచ్‌లో నువ్వు నాకంటే బాగానే ఆడావు... అని చెప్పాడు...

56
Shubman Gill

అప్పుడే ధోనీ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన విషయం గుర్తొచ్చింది. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. ఆ విషయం గుర్తుకురాగానే నేను నవ్వడం మొదలెట్టా.. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న నా ఫీలింగ్స్ అర్థం చేసుకుని, దగ్గరికొచ్చి మాహీ అలా మాట్లాడడం నేను ఎప్పటికీ మరిచిపోలేను...

66
Shreyas Iyer-Shubman Gill

నా దృష్టిలో ఎప్పుడూ విరాట్ కోహ్లీయే బెస్ట్ కెప్టెన్. కోహ్లీ కెప్టెన్సీలో బాగా ఎంజాయ్ చేశాను. ప్లేయర్లలో ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసి, కోహ్లీ నింపుతాడు. అందుకే కోహ్లీ కెప్టెన్సీ అంటే ఇష్టం...’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

Read more Photos on
click me!

Recommended Stories