కోహ్లీ కెప్టెన్సీ నుంచే ఇంగ్లాండ్ ఈ ఆటతీరు నేర్చుకుంది... - ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్...

First Published Dec 7, 2022, 9:53 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి బ్యాటుతో రికార్డుల మోత మోగిస్తున్నాడు విరాట్ కోహ్లీ... ఐసీసీ టైటిల్ గెలవకపోయినా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు అసాధారణం. ముఖ్యంగా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్లలో టాప్ 3లో ఉన్నాడు విరాట్ కోహ్లీ... తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

Ben Stokes Test

జో రూట్ కెప్టెన్సీలో ఒక్క టెస్టు గెలవడానికి అష్టకష్టాలు పడిన ఇంగ్లాండ్ జట్టు, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుస విజయాలతో బుల్లెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రావల్సిండి టెస్టులో పాకిస్తాన్‌పై ఘన విజయం అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మరింత పైకి ఎగబాకింది..

బెన్ స్టోక్స్‌ కెప్టెన్సీ చేపట్టక ముందు 12 టెస్టులు ఆడి రెండే రెండు టెస్టుల్లో గెలిచి... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఇంగ్లాండ్ జట్టు... అయితే బెన్ స్టోక్స్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్‌కి 8 టెస్టుల్లో 6 విజయాలు అందించాడు. సౌతాఫ్రికా టూర్‌లో 2 టెస్టులు ఓడిపోవడం మినహా టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లపై ఘన విజయాలు అందుకుంది ఇంగ్లాండ్...

Pakistan vs England

తాజాగా బౌలింగ్‌కి ఏ మాత్రం సహకరించని రావల్పిండి పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు 20 వికెట్లు పడగొట్టగలిగారు. బ్యాటింగ్‌ పిచ్‌పై ఇంగ్లాండ్ నుంచి నలుగురు బ్యాటర్లు, పాకిస్తాన్ నుంచి ముగ్గురు సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది...

ఈ టెస్టు విజయం తర్వాత విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో నిలుస్తుండడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలే. ‘ఇంగ్లాండ్ టీమ్‌ టెస్టులను ఆడుతున్న తీరు కొత్తదేమీ కాదు. 90ల్లో ఆస్ట్రేలియా జట్టు ఇలాగే ఆడేది...

Virat Kohli

అంతెందుకు వెస్టిండీస్ జట్టు, పూర్తిగా స్టోక్ మేకర్లతో నిండి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆటతీరు టీమిండియాలోనే కనిపించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఇదే స్టైయిల్‌తో విజయాలు అందుకుంది. అదే ఇప్పుడు ఇంగ్లాండ్ ఫాలో అవుతోంది. భారత జట్టులో అన్ని పరికరాలు ఉన్నాయి. వాటిని కరెక్టుగా ఎలా వాడాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు...

Image credit: Getty

బెన్ స్టోక్స్, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడని పాకిస్తాన్ ఊహించి ఉండదు. వాళ్ల ముందు మరో ఆప్షన్ లేకపోయింది. ఊరించే టార్గెట్ ఉండడంతో ప్రయత్నించాలని కొందరు, డ్రా చేసుకుందామన్నట్టు మరికొందరు బ్యాటర్లు ఆడారు. టీమ్ మొత్తం ఒకే స్టైల్‌ని అలవర్చుకోలేకపోవడం వల్లే ఓడిపోయింది...

England Win

నాలుగో రోజు టీ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండడు. బాబర్ ఆజమ్ కూడా అలాంటి షాక్‌కే గురి అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఇంగ్లాండ్ మిగిలిన పని కానిచ్చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ డేవిడ్ లాయిడ్..  

click me!