విరాట్ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు... బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అది కొడితే...

First Published Dec 13, 2022, 10:37 AM IST

మూడేళ్లుగా సెంచరీ చేయలేక, కెప్టెన్సీ కోల్పోయి జట్టులో చోటు ఇవ్వడం కూడా వేస్ట్ అని విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత ఫామ్‌ని ఘనంగా చాటుకున్నాడు. నెల రోజులు గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ... మూడేళ్లుగా అందని సెంచరీని సొంతం చేసుకున్నాడు...
 

virat

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెరీర్ బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌లో ఒంటి చేత్తో ఘన విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అందుకున్నాడు...

Image credit: Getty

కెరీర్‌లో 71వ సెంచరీ అయినా విరాట్ కోహ్లీకి టీ20ల్లో దక్కిన మొట్టమొదటి సెంచరీ ఇదే.తాజాగా బంగ్లాదేశ్ టూర్‌లో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే..ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన అరుదైన జాబితాలో చోటు దక్కించుకుంటాడు...

2010లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే, టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా... మూడు ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేశారు. 2011లో లంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఫీట్ సాధించాడు...

2014లో పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షాజాద్ మూడు ఫార్మాట్లలోనే సెంచరీలు చేయగా, 2016లో బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించారు. వన్డే, టీ20ల్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నా టెస్టుల్లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి రోహిత్ శర్మకు చాలా కాలమే పట్టింది...

2017లో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. 2019లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ సాధించగా పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇదే ఏడాది 2022లో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశాడు...

2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి వన్డే, టెస్టుల్లో గ్యాప్ లేకుండా సెంచరీలు చేస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే 2019 తర్వాత కరోనా లాక్‌డౌన్ నుంచి విరాట్ కోహ్లీ సెంచరీలకు బ్రేక్ పడింది...

Image credit: Getty

రెండేళ్లుగా సెంచరీ లేకుండానే గడిపేసిన విరాట్ కోహ్లీ... మళ్లీ ఆసియా కప్ 2022 టోర్నీలోనే ట్రాక్‌లోకి ఎక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రికీ పాంటింగ్ రికార్డును దాటేసిన విరాట్, సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాతి స్థానంలో నిలిచాడు. 

కోహ్లీ బ్యాటు నుంచి టెస్టు సెంచరీ రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రెడ్ బాల్ క్రికెట్‌లో రికార్డు లెవెల్లో డబుల్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... చివరసారిగా 2019 నవంబర్‌లో టెస్టు సెంచరీ సాధించాడు.

click me!