విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌కి ముందు అందరికీ సమాధానం చెబుతాడు... హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

First Published Jan 2, 2022, 5:08 PM IST

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్ కూడా పతనమవుతూ వస్తోంది... రెండో టెస్టు ఆరంభానికి ముందు విరాట్ ఫామ్‌పై కామెంట్లు చేశాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..

‘విరాట్ కోహ్లీ గత 20 రోజులుగా నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు.. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా చెమటోడుస్తున్నాడు...

అతను నెట్స్‌లో కష్టపడుతున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, ఓ అద్భుతమైన బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కూడా..

విరాట్ కోహ్లీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అతను ఫామ్‌లో లేకపోయినా, పరుగులు సాధిస్తూనే ఉన్నాడంటే విరాట్ ఎలాంటి ప్లేయరో అర్థం చేసుకోవచ్చు...

త్వరలోనే అతను భారీ సెంచరీలు చేయబోతున్నాడని నాకు అనిపిస్తోంది. భారీ ఇన్నింగ్స్‌ ఆడడానికి ఎంత కష్టపడాలో, అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్, శ్రమ పడుతున్నాడు విరాట్...

ఆన్ ఫీల్డ్ మాత్రమే కాదు, ఆఫ్ ఫీల్డ్ కూడా విరాట్ కోహ్లీ చాలా గొప్ప కెప్టెన్. తన టీమ్ ప్లేయర్లకు ఏం కావాలో, వారి సమస్యలేంటో విరాట్‌కి బాగా తెలుసు... అతని సింప్లిసిటీ వేరే లెవెల్..

కోహ్లీ ప్రెస్ మీట్స్‌కి హాజరుకాకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ప్రెస్ మీట్స్‌కి రావొద్దని ఎవ్వరూ చెప్పలేదు. తన 100వ టెస్టులో విరాట్ అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.

Rahul Dravid

సెంచూరియన్ టెస్టుతో 98 టెస్టులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, జోహన్‌బర్గ్‌లో 99వ టెస్టు, ఆ తర్వాత కేప్ టౌన్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు...

click me!