విరాట్ కోహ్లీ కావాలనే ఇలా ఆడుతున్నాడా... బీసీసీఐపై రివెంజ్ డ్రామాలో తన ఆటనే...

First Published Jan 21, 2022, 3:43 PM IST

విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య కొనసాగుతున్న వైరం... భారత జట్టు పరువు తీస్తోంది. ఇప్పటికే బీసీసీఐ రాజకీయాలు, విరాట్ కోహ్లీ ఇగోల కారణంగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచే సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకుంది భారత జట్టు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో విరాట్ ఆటపై కూడా అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...

గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేడు. గత దశాబ్దంలో సెంచరీల మోత మోగించి, 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీతో దశాబ్దపు ఉత్తమ క్రికెటర్’ అవార్డు గెలిచిన కోహ్లీ, ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

సెంచరీ అయితే రాలేదు కానీ, విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి పరుగులు రాకుండా ఉన్నది ఎప్పుడూ లేదు. ఇంగ్లాండ్ టూర్‌లో, సఫారీ టెస్టు సిరీస్‌లోనూ బాగానే రాణించాడు విరాట్ కోహ్లీ...

వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో కెప్టెన్సీని కోల్పోయిన విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, ప్రవర్తన... ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఒకింత ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తోంది...

మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. శిఖర్ ధావన్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్, మరో 5-10 ఓవర్లు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది...

14 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న విరాట్ కోహ్లీకి ఈ విషయం తెలియని కాదు. అయినా ధావన్ అవుటైన కొద్దిసేపటికే కీలక సమయంలో విరాట్ అవుట్ కావడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపింది...

అలాగే రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు విరాట్. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బ్యాటు నుంచి కనీసం 30+ స్కోరు వచ్చినా భారత జట్టు స్కోరింగ్ కార్డు వేరేగా ఉండేది...

కోహ్లీ ఆటతీరు, అతని యాటిట్యూడ్ చూస్తుంటే... బీసీసీఐ తనతో ప్రవర్తించిన తీరు పట్ల విరాట్ మానసికంగా చాలా కృంగిపోయినట్టు తెలుస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా వేరు...

సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నది కొన్ని రోజులే. టీమ్‌లో చోటు కోల్పోయేముందు సౌరవ్ గంగూలీ బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యేవాడు... కనీసం రెండు నిమిషాలు కూడా క్రీజులో నిలిచేవాడు కాదు...

ఆ ఇద్దరితో పోలిస్తే విరాట్ కోహ్లీ టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, వన్డేల్లో అత్యధిక విజయాల శాతం ఉన్న సారథి... అయినా బీసీసీఐ, విరాట్‌ను అగౌరవపరిచింది...

అందుకే తాను సరిగా ఆడకపోతే, తన కెప్టెన్సీ లేకపోతే భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్పాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీ ఉన్నట్టుగా ఉందని ఆరోపిస్తున్నారు కొందరు నెటిజన్లు..

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, ఇలా ఆడితే అది అతని కెరీర్‌కే ప్రమాదం. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి ప్లేయర్లే, కెరీర్ చివర్లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు...

కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ, సరిగా పరుగులు చేయలేకపోతే అతనికి కూడా సెహ్వాగ్, యువరాజ్ పరిస్థితి వచ్చినా రావచ్చని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి...

ఈ వార్తలు, సందేహాలు, అనుమానాలు నిజమైనా, కాకపోయినా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఓ సెన్సేషనల్ ఇన్నింగ్స్ చూసి చాలా ఏళ్లే అయ్యింది. కింగ్ కోహ్లీ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వస్తే, చూడాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్...

click me!